రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఫుల్ క్రేజ్ ఉన్న కథానాయిక.రష్మిక మందన్న చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ‘చలో’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈమె ‘గీత గోవిందం’తో పాపులర్ అయిపోయింది. అక్కడ నుంచి తెలుగులో బిజీగా మారిపోయింది.కన్నడ కస్తూరి అయిన రష్మిక ప్రస్తుతం మహేష్ బాబు – అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. లక్షల నుంచి కోటికి.. తగ్గను కాక తగ్గనంటోంది. ‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడప తొక్కిన ఈ భామ వరుస సినిమాలతో బిజీ అయింది. ఆమె సినిమాలు ఒక్కొక్కటీ సూపర్ డూపర్ హిట్ అవుతుండడంతో దర్శకనిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారట. అయితే ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్న నానుడిని తూచా తప్పకుండా పాటిస్తూ, తన రెమ్యునరేషన్‌ను అమాంతంగా పెంచేసిందట. నిన్న మొన్నటి వరకూ లక్షల్లో తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు కోటికి పైగా పెంచిందట. అంత ఇస్తేనే తన గడప తొక్కమంటూ తన దగ్గరకొచ్చేవారికి నిక్కచ్చిగా చెప్పేస్తోందట! ఆమె సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడంతో వచ్చినవారు ఆమె చెప్పిన రేటుకి ఓకే అంటున్నారట. అలా దాదాపు అరడజనుకు పైగా సినిమాలను రష్మిక లైన్లో పెట్టిందట.
ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’లో చేసింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక సొంత పట్టణం బెంగళూరులో ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్ సందర్భంగా… ‘తాజాగా మీరు పారితోషికం కోటి రూపాయలకు పెంచినట్టున్నారు?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రష్మిక సమాధానం ఇస్తూ… ‘అందులో తప్పు ఏముంది?’ అని పేర్కొంది ఈ కథానాయిక. ఈ చిత్రసీమలో మూడేళ్లుగా పనిచేస్తున్నానని, కొన్ని హిట్ సినిమాలు ఇచ్చానని అందువల్ల పారితోషికం పెంపునకు తాను అర్హురాలనేనని ఆమె సమర్థించుకున్నారు. ‘నేను తీసుకోవాల్సిందే తీసుకుంటున్నా. ప్రస్తుతం ఉన్న అగ్ర కథానాయికలు పొందుతున్న పారితోషికంలో నేను తీసుకుంటున్నది చాలా తక్కువ’ అని సూటిగా చెప్పింది.
అందరు చాలా ఏడిపించేశారట !
రష్మిక మందన్న తనకు కలిసి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తనను ఎంత ఇబ్బంది పెట్టారో రష్మిక పూసగుచ్చినట్టు వివరించింది. తనను బాగా టీజ్ చేశారని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. వేధింపులు అంటే సీరియస్‌గా కాదండోయ్ … సినిమాలో కొన్ని సీన్లు షూటింగుకు సంబంధించి ఆమెను బాగా ఇబ్బంది పెట్టారట.
పదినిమిషాల క్రికెట్ కు సంబంధించి ఆమెతో ఏకంగా నాలుగు నెలల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేయించారట. ఈ ప్రాక్టీస్ లో తనకు చాలా దెబ్బలు తగిలాయి అని కూడా చెప్పింది. షూటింగ్ అయిపోతుందనుకుంటున్న టైంలో లొకేషన్ లో ఇరవై రోజుల పాటు ఆమెను అందరు చాలా ఏడిపించేశారట. డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని బయట పెట్టింది. ఇదంతా ఏదో సీరియస్ గా చెప్పడం లేదని ఇష్టంతోనే చెబుతున్నాను అని చెప్పింది.చివరకు డబ్బింగ్ టైంలో కూడా తనను చాలా ఇబ్బంది పెట్టారని… నాలుగు నెలల పాటు డబ్బింగ్ చెప్పించారు… మొన్న కూడా ఓ సీన్‌కు డబ్బింగ్ చెప్పమన్నారని నవ్వుతూ చెప్పింది. తనను ఇంత ఇబ్బంది పెట్టినా సినిమాను చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది.