రష్మిక మందన్నా సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలవుతున్న సందర్భంగా రష్మిక మందన్నా ఇంటర్వ్యూ…
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
మీరు ట్రైలర్ చూస్తే ఈ పాటికి అర్థం అయి ఉంటుంది. హీరో వెంటపడి బాగా అల్లరి చేసే క్యారెక్టర్. ఎక్ట్రీమ్లీ డ్రమోటిక్ అండ్ కామికల్‌గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాకు ఫుల్ లెంగ్త్ కామెడీ చేసే అవకాశం దక్కింది.
బాగా అల్లరి చేసేవారా?
సాధారణంగా సెట్లో సీరియస్‌గా ఉండటం నాకు నచ్చదు. అల్లరి చేయడం అంటేనే ఇష్టం. అందుకని సెట్లో అందరితో జోవియల్‌గా ఉండేదాన్ని.
మహేశ్‌లో నచ్చిన క్వాలిటీస్
సెట్లో మహేశ్‌గారు చాలా క్వైట్ అండ్ కామ్‌గా ఉండేవారు. నేనే వెళ్ళి తనని డిస్ట్రబ్ చేసేదాన్ని.
మీ క్యారెక్టర్‌కి సెపరేట్ మేనరిజమ్స్
అవునండీ. మీకు అర్థమవుతుందా. అలాగే ఐయాం ఇంప్రెస్డ్లాంటి మేనరిజమ్స్ సినిమా అంతా ఉంటుంది. దాంతో పాటు సంగీతగారితో కలిసి చేసే నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్లాంటి మేనరిజమ్స్ ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతాయి.
అనిల్ రావిపూడి చేసి చూపించేవారా?
నేను ఒక్కటే చెప్పాను. సార్ మీరు చేయండి. నేను కాపీ చేస్తా. ఐయాం వెరీ గుడ్ కాపీ క్యాట్. ఆయన చేసేదాన్ని స్కాన్ చేసి నా స్టైల్లో చేసేదాన్ని.
విజయశాంతిగారితో బాండింగ్ ఎలా ?
కేరళ షెడ్యూల్లో నేను మొదటిసారి ఆమెను కలిశాను. నాకు ఇంతకుముందే మేడమ్ గురించి తెలుసు. లేడీ అమితాబ్లాంటి ఆమెతో కలిసి మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది. తర్వాత సెట్లో ఆమె ఎనర్జీ చూసి ఫిదా అయ్యాను. వరుసగా రెండు రోజులు ఆమెతోనే ఉన్నాను. డ్యాన్స్, నటనకి సంబంధించిన కొన్ని సలహాలు అడిగి తెలుసుకున్నాను.
మీ సినిమాల గురించి మహేశ్
మహేశ్‌గారు దాదాపు అన్ని సినిమాలు చూస్తారు. నేను నటించిన ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు చూశానని చెప్పారు.
ఇందులో మీకు సాలీడ్ రోల్ ఉండటం...
ఐయాం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆ క్యారెక్టర్ అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనే దానికి సాలీడ్ రీజన్ ఉంటుంది.
ఈ సినిమా చేయడానికి రీజన్?
అనిల్ సర్ ఈ స్క్రిప్ట్ నేరేట్ చేసేటప్పుడే నా క్యారెక్టర్, సంగీతగారి క్యారెక్టర్, ఎలా ఉంటుందో చేసి చూపించారు. అప్పుడే నాకు బాగా నచ్చింది. అందులోనూ ఈ సినిమాలో మంచి ఫీల్ ఉంది. అలాగే మహేశ్, విజయశాంతిగారితో కలిసి నటించడం బోనస్.
ట్రైయిన్ ఎపిసోడ్ గురించి?
నేను డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆ సన్నివేశాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. షూటింగ్ చేస్తున్నప్పుడే టీమ్ అంతా బాగా నవ్వుకున్నాం. రేపు ప్రేక్షకులు కూడా ఆ కామెడీ ట్రాక్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.
మైండ్ బ్లాక్ సాంగ్..
ఆ సాంగ్ చిత్రీకరణ రోజు ఈ అమ్మాయికి డ్యాన్స్ వచ్చో, రాదో అనే సందేహం అందరికీ ఉంది. కానీ ఒక చిన్న డ్యాన్స్ బిట్ చేసి చూపించాను. అందరూ ఎగ్జైట్ అయ్యారు. అలా మహేశ్‌గారితో డ్యాన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఎలా ఉందో రేపు థియేటర్లో సినిమా చూసి మీరే చెప్పాలి.
హీరోయిన్‌కి సితార ఫ్రెండ్
ఈ సినిమాకి కూడా సితార, నేను, ఆద్య ఒక గ్యాంగ్. మా ముగ్గురిలో ఎవరితో మాట్లాడాలన్నా మిగతా ఇద్దరికి తెలియాల్సిందే.
స్టేజ్ మీద చిరంజీవి కామెంట్స్
‘ఛల్లో’, ‘గీత గోవిందం’ సినిమాల ఈవెంట్స్‌కి చిరంజీవిగారు గెస్ట్‌గా వచ్చారు. అప్పుడు ఎందుకో మీరు నా లక్కీ ఛార్మ్ అనిపిస్తుంది సార్ అని చెప్పాను. అందుకే ఆయన అలా అనుంటారు. ఆయన చాలా స్వీట్ హార్ట్. నా ఫంక్షన్స్ అన్నింటికీ రావాలని కోరుకుంటున్నాను.
షూటింగ్ చాలా తొందరగా పూర్తి
బేసిగ్గా అనిల్ సర్కి స్క్రిప్ట్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. అలాగే రత్నవేలుగారు ఫాస్ట్‌గా వర్క్ చేస్తారు. ఒక సీన్ అయిపోగానే మరో సీన్‌కి వెంటనే షిఫ్ట్ అవుతారు. అలా క్లారిటీ ఉన్న దర్శకుడు, ఫాస్ట్‌గా వర్క్ చేయగలిగే టీమ్ ఉండటం వలనే షూటింగ్ తొందరగా పూర్తి చేయగలిగాం.
మీ నెక్స్ట్ మూవీస్?
ప్రస్తుతం నితిన్‌తో ‘భీష్మ’ చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో మూవీ చేస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.. అంటూ చెప్పింది రష్మిక.