‘సినిమా బ్యాక్‌గ్రౌండ్‌కి చెందిన అబ్బాయిని పెళ్ళి చేసుకోను. రెగ్యులర్ టైమ్ బేస్డ్ జాబ్ చేసే వ్యక్తిని మాత్రమే పెళ్ళి చేసుకుంటా. జాబ్ అయిపోయాక నాతో టైమ్ స్పెండ్ చేసేలా ఆ వ్యక్తి ఉద్యోగం ఉండాలి’ అని అంటోంది రష్మిక మందన్నా. ఆమె కన్నడలో ‘కిర్రిక్ పార్టీ’ చిత్రంతో పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో నటించిన హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ గతేడాది బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇటీవల ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకి రష్మిక పై విధంగా స్పందించింది….’రక్షిత్‌ది నేను కోరుకున్న దానికి పూర్తి భిన్నమైన జాబ్. అతను ఇండిస్టీకి చెందిన వ్యక్తి. తను నాకు టైమ్ ఇవ్వలేడు’ అని తెలిపింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘డియర్ కామ్రేడ్’లో నటిస్తుంది. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో విజయ్, రష్మికల ముద్దు సీన్‌పై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై రష్మిక స్పందిస్తూ… ‘సీన్, కథ డిమాండ్ మేరకే మేం అలా చేయాల్సి వచ్చింది. ఒక సీన్ చూసి నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. సినిమా చూశాక అక్కడ లిప్ లాక్ అవసరమో, లేదో మీరే చెబుతారు. కథ డిమాండ్ చేయకుండా అలాంటి సన్నివేశాలుండవు’ అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ‘డియర్ కామ్రేడ్’తోపాటు ‘పోగరు’, కార్తీ చిత్రంలో నటిస్తుంది.
తమిళంలోనూ క్రేజీ కథానాయిక
‘గీతగోవిందం’తో రష్మిక మందన్నా తెలుగులో క్రేజీ కథానాయికగా మారారు. దీంతో ఆమెకు తెలుగులో మంచి మంచి అవకాశాలొస్తున్నాయి. అంతేకాదు తమిళంలోనూ క్రేజీ కథానాయికగా గుర్తింపు పొందుతున్నారు.ఇప్పటికే కార్తి హీరోగా రూపొందే ఓ చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యారు. ఇటీవల ఈ సినిమా కూడా ప్రారంభమైంది. తాజాగా మరో బంపర్ ఆఫర్‌ని రష్మిక అందుకున్నారు. యువ కథానాయకుడు శివ కార్తీకేయన్ సరసన నటించే అవకాశం ఆమెని వరించింది. ఈ సినిమాకి విగేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూర్చనున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రారంభం కానుందని సమాచారం.ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘డియర్ కామ్రేడ్’, నితిన్‌తో ‘భీష్మ’, కన్నడలో ‘పొగరు’లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.ఇదిలా ఉంటే, మహేష్‌బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలోనూ కథానాయికగా రష్మిక పేరుని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.