ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తొలిసారి రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్ హైదరబాదీ` ట్యాగ్ లైన్. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ఔట్ స్టాండ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. టైటిల్ రోల్‌లో నటించిన రామ్ టెరిఫిక్ షో చేశాడని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేస్తున్నారు. మూడు పాటల చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ పాటలను హైదరాబాద్‌లో భారీ సెట్స్ వేసి చిత్రీకరించబోతున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు:
రామ్,నిధి అగర్వాల్,నభా నటేష్
పునీత్ ఇస్సార్,సత్యదేవ్,ఆశిష్ విద్యార్థి
గెటప్ శ్రీను,సుధాంశు పాండే తదితరులు
రామ్,నిధి అగర్వాల్,నభా నటేష్
పునీత్ ఇస్సార్,సత్యదేవ్,ఆశిష్ విద్యార్థి
గెటప్ శ్రీను,సుధాంశు పాండే తదితరులు
సాంకేతిక వర్గం:
ఫైట్స్: రియల్ సతీష్,సాహిత్యం: భాస్కరభట్ల,ఎడిటర్: జునైద్ సిద్ధికీ
ఆర్ట్: జానీ షేక్,సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్,దర్శకత్వం: పూరి జగన్నాథ్.