దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సంచలన చిత్రం ‘బ్యూటిఫుల్’. (ట్రిబ్యూట్ టు ‘రంగీలా’). నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా చేస్తున్నారు. అగస్త్య మంజు దర్శకుడు. లోగడ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు రామ్ గోపాల్ వర్మతో పాటు అగస్త్య మంజు సహ దర్శకత్వం వహించారు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న రామ్ గోపాల్ వర్మ చిత్రమిది. టి.అంజయ్య సమర్పణలో… టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. వైవిధ్య భరిత అంశాలతో ఆకట్టుకునే ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల అవుతుంది
పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.