రమేష్ చౌదరి ‘ఒకటే లైఫ్’ ఆడియో లాంచ్

యువ నిర్మాత నారాయణ రామ్ లార్డ్ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ” ఒకటే లైఫ్”  ‘హ్యాండిల్ విత్ కేర్’  అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం ఆడియో లాంచ్ ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో జరిగింది.బి.జె.పి. అధికార ప్రతినిధి రఘునందన రావు  ఆడియోను విడుదల చేసారు.
 
అనంతరం రఘునందన రావు మాట్లాడుతూ… సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత  R. B. చౌదరి కుమారుడు  రమేష్ చౌదరి హీరోగా నటిస్తున్నారంటే.. దీనిని సూపర్ గుడ్ కుటుంబం గా భావించవచ్చును. ఏ రంగం లో ఉన్నవారు. ఆ రంగంలో వారిని ప్రోత్సాహించాలి.కొత్తధనం రావాలి. చిన్న సినిమాలు బతకాలి. నాలుగు కుటుంబాలు. నలుగురు హీరోలే అంటే కుదరని పరిస్థితి వచ్చింది.. కొత్త వాళ్లు వస్తే కొత్త ఆలోచనల తో చిత్ర సీమ కొత్త కళల తో  నిండుగా ఉంటుంది. అన్నారు.
 
నిర్మాత నారాయణ రామ్ మాట్లాడుతూ.. బిగ్ సి.డి. విడుదల కు రఘునందన రావు గారు రావటం. చాలా ఆనందంగా ఉంది. ఆడియో సక్సెస్ అయినట్లే .సినిమా కూడా సక్సెస్ అవుతుంది. అని నమ్ముతున్నాను. అన్నారు.
 
దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ… నాకు ఇది తొలి అవకాశం నన్ను నమ్మి అవకాశం ఇచ్చి న నిర్మాతకు .. నాకు పూర్తి సహకారం అందించిన హీరోకి ధన్యవాదాలు.. టెక్నాలజీ తో పరుగు పెడుతున్న నేటి తరం.మానవత విలువలకు.కుటుంభ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కదాంశం తో. తెరకెక్కిన చిత్రం. వచ్చే నెల లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.. అన్నారు
 
హీరో రమేష్ చౌదరి మాట్లాడుతూ.. “ఒకటే లైఫ్” సినిమా నాకు పెద్ద టర్నింగ్ అవుతుంది. తెలుగు లో “విద్యార్థి” చిత్రం తరువాత కొన్ని తమిళ్ సినిమాలు చేశాను. చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం చేస్తున్నాను. యువత కి మంచి మెస్సేజ్ ఇచ్చే చిత్రం ఇది. దర్శక నిర్మాత లకు కృతజ్ఞతలు…అని అన్నారు.