రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం‘ఉందా..లేదా?’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సో మవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన `మా` అద్యక్షుడు శివాజీ రాజా చిత్ర యూనిట్ కి జ్ఞాపికల్ని అందజేశారు.
అనంతరం శివాజీ రాజా మాట్లాడుతూ, `ఇటీవలే మంచి కథతో వచ్చిన ‘మెంటల్ మదిలో’ పెద్ద సక్సెస్ అయింది. చిన్న వయసులో నే దర్శక, నిర్మాతలు గా మారుతున్నారు. మంచి కథలతో సినిమా చేసి సక్సెస్ అందుకుంటున్నారు. ‘ఉందా? లేదా?’ చిత్రం కూడా ఆ కోవలనే మంచి విజయాన్ని అందుకోవాలి` అని అన్నారు.
చిత్ర నిర్మాత ఎస్. కమల్ మాట్లాడుతూ, ` రామ్ జగన్, జీవా, ఝాన్సీ పాత్రలు సినిమాకు హైలైట్ గా ఉంటాయి. ఆడియన్స్ కు కొత్త ఫీల్ దొరుకుతుంది. దర్శకుడు చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. డిసెంబర్ 15న సినిమా 150 నుంచి 200 థియేటర్లలలో సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులంతా తప్పకుండా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
చిత్ర దర్శకుడు వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ, ` ఇది రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. `ఉందా.. లేదా` అనే టైటిల్ తోనే క్యూరియాటీ మొదలైంది. అదే సినిమాకు బోలెడంత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. చిన్న సినిమాగా ప్రారంభమైనా పెద్ద సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా తెరకెక్కించాం. టెక్నికల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. డిసెంబర్ 15న ప్రేక్షుకుల మందుకు వస్తున్నాం` అని అన్నారు.
సినిమాలో అవకాశం పట్ల హీరో, హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేసారు. అలాగే ఈ కార్యక్రమంలో రామ్ జగన్, జీవా ఇతర నటీనటులతో పాటు..చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గోన్నారు.
నటీనటులు :రామకృష్ణ ,అంకిత ,కుమార్ సాయి,జీవా, రామ్‌జగన్ ,ఝూన్సీ,ప్రభావతి , బ్యానర్ : జయకమల్ ఆర్ట్స్ , ఎడిటర్ :మణికాంత్ తెల్లగూటి కొరియోగ్రఫీ: నందు జెన్నా, పాటలు :నాగరాజు కువ్వారపు ,శేషు మోహన్ ,సింగర్స్ :సింహ ,హేమచంద్ర ,స్వీకర్ అగస్సీ , మ్యూజిక్ : శ్రీమురళీ కార్తికేయ సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కె బంగారి సహానిర్మాతలు : అల్లం సుబ్రమణ్యం ,అల్లం నాగిశెట్టి , నిర్మాత : అయితం ఎస్ కమల్, దర్శకత్వం : అమనిగంటి వెంకట శివప్రసాద్.