ఈ ఏడాది ఇప్పటికే ఐదు సినిమాల సక్సెస్‌తో బాక్సాఫీస్ వద్ద నిర్మాతగా ..తన సెలక్షన్ ఆఫ్ మూవీస్ గురించి చెప్పకనే చెప్పిన దిల్‌రాజు..ఇదే ఏడాది విడుదల కానున్న `ఎం.సి.ఎ` చిత్రంతో డబుల్ హ్యాట్రిక్‌ను సాధించనున్నారు. ఇదే ఊపులో వచ్చే ఏడాది ఎనర్టిటిక్ హీరో రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ 2017 ప్రారంభంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన `నేను లోకల్` సినిమా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.
రామ్ ఎనర్జీకి, త్రినాథరావు నక్కిన టేకింగ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేకింగ్ వాల్యూస్ తోడు కావడం సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో చాలా కీలకమైన పాత్ర ఒకటి పోషిస్తున్నారు. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రం లో నటిస్తారు. ఈ చిత్రానికి కధ ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. సాయి కృష్ణ రచనా సహకారం అందిస్తారు. ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఇతర టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాణ సంస్థ తెలియజేసింది