సినీవినోదం రేటింగ్ : 2.25/5
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
తమిళంలో మాస్, యాక్షన్ సినిమాలకు పేరున్న దర్శకుడు లింగుస్వామి. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. లింగుస్వామి దర్శకత్వం వహించిన తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ది వారియర్’. హీరో రామ్ ఫస్ట్‌టైమ్ పోలీస్ పాత్రను పోషించడంతో ఈ సినిమా ఆసక్తిని పెంచింది
కధ… సత్య (రామ్) వైద్య విద్యార్థి. ఏంబీబీఎస్ పూర్తి చేసుకొని కర్నూల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌గా సేవలందించడానికి వస్తాడు. అక్కడి లోకల్ డాన్ గురు (ఆది) పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని అనేక అరాచకాలకు పాల్పడుతుంటాడు. వీటిని ప్రశ్నించిన సత్యపై పగ పెంచుకుంటాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వైరం పెరుగుతుంది. ఓ డాక్టర్‌గా గురు అన్యాయాలపై తిరగబడలేనని తెలుసుకున్న రామ్ పోలీస్ అధికారిగా కర్నూల్ వస్తాడు. తనకు జరిగిన అన్యాయానికి అతను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అక్కడి రేడియో జాకీ విజిల్ మహాలక్ష్మీ (కృతిశెట్టి)తో అతని ప్రేమాయణం ఎలాసాగింది? అనేవి సినిమాలో చూడాలి …
విశ్లేషణ … సినిమా ఎలా ఉండాలో కమర్షియల్ లెక్కలేసుకుని ఈ సినిమా తీసాడు లింగుసామి. కొన్ని సినిమాల్లో కావాల్సిన హంగులన్నీ ఉన్నా.. ఉండాల్సిన కథ, కధనం విషయంలోనే చేతులేత్తేస్తారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. రొటీన్‌కే రొటీన్ సినిమా అనిపిస్తుంది.. ఈ వారియర్. సినిమా మొత్తంలో కాస్త కొత్తగా అనిపించిన పాయింట్ డాక్టర్.. పోలీస్ ఆఫీసర్ అవ్వడం. ఇదేదో భలే ఉందే అనేలోపే.. దాన్ని కూడా రొటీన్ చేసేసాడు దర్శకుడు. ఇంటర్వెల్ వరకు డాక్టర్.. ఆ తర్వాత పోలీస్ గా.. కథ నడిపిస్తారు. ఏ మలుపులు, ట్విస్ట్ లేకుండా.. చాలా సాదాగా నడుస్తుంది వారియర్ కథ.
లింగుసామి ఎప్పుడో చేసిన ‘పందెంకోడి’ ఛాయలు కొన్నిఇందులో కనిపిస్తాయి. ఒకప్పుడు రొటీన్ కథలతోనే మ్యాజిక్ చేసేవాడు లింగుసామి. కానీ ఇప్పుడది మిస్సైన ఫీలింగ్ కలిగింది. రొటీన్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ కథలో అక్కడక్కడా మాస్ సీన్స్ ఉన్నా.. పెద్ద కిక్ ఇవ్వలేదు. లిప్ సింక్ లేని డబ్బింగ్ ఇబ్బంది పెడుతుంది. ఏది ఏమైనా వారియర్ ని తట్టుకోవడం కష్టమే.
నటీనటులు… డాక్టర్‌గా, పోలీస్‌గా సత్య పాత్రలో రామ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో అందరినీ మరోసారి మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో మరింత స్టైలీష్‌గా కనిపించాడు. డాక్టర్ గెటప్ కంటే.. పోలీస్ లుక్కులోనే రామ్ కొత్తగా కనిపిస్తాడు. ఆది పినిశెట్టి మరోసారి విలనిజం పీక్స్‌లో చూపించాడు..
కృతి శెట్టి బాగుంది. చలాకీగా కనిపించి విజిల్ మహాలక్ష్మీ పాత్రలో కృతి శెట్టి ఎంతో క్యూట్‌గా, బబ్లీగా కనిపించింది. మరోసారి ఆడియెన్స్‌ను తన లుక్స్‌తో కట్టిపడేస్తుంది.నదియా, బ్రహ్మాజీ వంటి వారు సినిమాలో మంచి పాత్రలను పోషించారు.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం పర్లేదు. డీఎస్పీ ఇచ్చిన రెండు పాటలు, అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ముఖ్యంగా ఆదికి వచ్చే ఆర్ఆర్ అదిరిపోయింది. సుజీత్ వాసుదేవ్ కెమెరాపనితనం చక్కగా కుదిరింది. ఎడిటింగ్‌లో ఎన్నో సీన్లకు కత్తెర పడాల్సింది -రాజేష్