క్రైమ్ థ్రిల్లర్ కం లవ్ స్టోరీలతో హిట్లు కొట్టే ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోనే మరో ప్రయత్నం `రెడ్`. రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. గ్రిప్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్లు ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్ టైనర్.. ఆద్యంతం ఎమోషన్స్ రక్తి కట్టిస్తాయి. నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.
తాజాగా టీజర్ రిలీజైంది. రామ్ ద్విపాత్రాభినయం ఊహకందని ట్విస్టులతో క్యూరియాసిటీ పెంచుతోంది. ‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైమ్’ అంటూ మొదలు పెట్టడం ఆసక్తిని పెంచింది. ఇంకేదో సస్పెన్స్ ఎలిమెంట్ ఉందని ట్రైలర్ ముగింపులో`నేనే`అనే డైలాగ్ తో క్లూ ఇచ్చేశారు. అసలింతకీ ఆ క్లూ వెనక ఫుల్ క్రైమ్ స్టోరీ ఏమిటో తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే. రామ్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్పులతో ట్రైలర్ లో ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించాడు. నివేద థామస్, మాళవిక శర్మ, నాజర్, అమృత అయ్యర్ పాత్రల్లో ఇంటెన్సిటీ ఆకట్టుకుంది. ఈ క్రేజీ సినిమాలో రెండు పాటల్ని యూరప్ డోలమైట్స్ .. ఇటలీ పర్వత సానువుల్లో తెరకెక్కించడం ప్రత్యేక ఆకర్షణ. సముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో చిత్రీకరించిన పాట హైలైట్ గా ఉండనుంది.
నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ-“కేవలం క్రైమ్ ఎలిమెంట్ మాత్రమే కాదు.. ఇందులో చక్కని లవ్ స్టోరి ఉంది. మదర్ సెంటిమెంట్.. ఎంటర్ టైన్ మెంట్ హైలైట్ గా నిలుస్తాయి. ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ చేస్తున్నాం”అని తెలిపారు.ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: జునైద్, సమర్పణ: కృష్ణ పోతినేని