షైన్ పిక్చర్స్ బ్యానర్ పై హీరో రామ్ కార్తిక్ నటిస్తున్న చిత్రం ‘తలచినదే జరిగినదా’. డైరెక్టర్ సూర్య తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ రెడ్డి, సంధ్య రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో రామ్ కార్తిక్ సరసన ఊర్వశి పరదేశి నటిస్తోంది. సూర్య తేజ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కారక్రమం సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియో లో జరిగింది. ఈ నూతన చిత్రానికి ముఖ్య అతిథులుగా నిర్మాత సి. కళ్యాణ్ హాజరయ్యి క్లాప్ ఇవ్వగా, తెలంగాణ సాంస్కృతిక శాఖ లాంగ్వేజ్ అండ్ కల్చరర్ అధ్యక్షుడు ఎమ్. హరికృష్ణ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా ‘దండు’ సినిమా దర్శకుడు సంజీవ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు సూర్య తేజ మాట్లాడుతూ.. ‘జెర్సీ’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా, గవర్నమెంట్ యాడ్స్ కు కూడా డైరెక్టర్ గా వర్క్ చేసాను. ఆ ఎక్స్పీరియన్స్ తోనే తొలిసారిగా ఈ మా ‘తలచినదే జరిగినదా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ చిత్ర స్టోరీ వినగానే హీరో రామ్ కార్తిక్, నిర్మాతలు శేఖర్ రెడ్డి అంగీకరించారు. స్టోరీ లైన్ విషయానికి వస్తే 2000 సంవత్సరాల క్రితం మొదలయ్యే జీవితాలకు ఇప్పటికీ ఉన్న తేడాను తెలపే ఫిక్షన్ స్టోరీనే ఈ చిత్రం. చాలాకాలం తరువాత బెస్ట్ తెలుగు సినిమా వస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ తో ఓ మంచి కథతో మీ ముందుకు రానున్నాము అని చెప్పారు.
నిర్మాత శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఒక కామెడీ తో కూడుకున్న ఫిక్షన్ త్రిల్లర్. జులై 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలై 2 షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తాము. సూర్య తేజ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ స్టోరీ చెప్పగానే సినిమా చేయాలనిపించింది. ఇందులో మొత్తం నాలుగు పాటలు, మూడు ఫైట్స్ ఉన్నాయి. హైద్రాబాద్ మరియు గోవాలలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
హీరో రామ్ కార్తిక్ మాట్లాడుతూ… వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ చిత్రం తరువాత నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. నేను ఎందుకు ఈ సినిమా చేస్తున్నానో త్వరలోనే మీ అందరికీ అర్థం అవుతుంది. మంచి ఫిక్షన్ స్టోరీ. ఆకట్టుకునేలా ఉంటుంది. త్వరలోనే మీ ముందుకు ఈ మా తలచినదే జరిగినదా చిత్రం ఉంటుందని, అలానే ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సి కళ్యాణ్ గారికి, హరి కృష్ణ గారికి నా ధన్యవాదాలు అని అన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన హరి కృష్ణ రావు మాట్లాడుతూ… కంటెంట్ నే నమ్ముకొని ఓ యంగ్ డైరెక్టర్ సూర్య తేజ్ వస్తున్నాడు. రియలిస్టిక్ గా, ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం సూర్య కష్టపడ్డాడు. అతని కష్టానికి నిర్మాతలు శేఖర్ రెడ్డి తోడై మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. రామ్ కార్తిక్ కు, హీరోయిన్ ఊర్వశి పరదేశి కు మంచి ఫ్లాట్ ఫామ్ అవుతుంది. అలానే నిర్మాతలకు మంచి పేరు తీసుకువస్తుందని నమ్ముతున్నా అలానే యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా అన్నారు.
రామ్ కార్తిక్, ఊర్వశి పరదేశి, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, సత్య, కేదార్ శంకర్, నళిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: ఎస్ ఎన్. వర్మన్, మ్యూజిక్: మిహి రామ్స్, ఎడిటర్: గ్యారీ, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, మాటలు: కనక వెంకటేష్.బి, నిర్మాతలు : శేఖర్ రెడ్డి, సంధ్య రెడ్డి, డైరెక్టర్: సూర్య తేజ. జి.