రాజమౌళి వెళ్లినా ‘నో’ అన్నాడన్నవార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.నిర్మాత సాయి కొర్రపాటి ఓ సినిమాపై మనసు పారేసుకున్నాడట. అయితే దాని డబ్బింగ్ రైట్స్ దక్కించుకోవడానికి సాయి ప్రయత్నించారట. కుదరక పోవడంతో దర్శకధీరుడు రాజమౌళితో మాట్లాడించారట అయినా కూడా ఆ సినిమా నిర్మాత ససేమిరా అన్నారట. అయితే రాజమౌళి వెళ్లడానికి వేరే కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ రాజమౌళి వెళ్లినా ‘నో’ అన్నాడన్న సమాచారం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.
శంకర్ డైరక్షన్లో.. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో దాదాపు రూ.400కోట్ల బడ్జెట్తో రజినీకాంత్ హీరోగా రోబో 2.0మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ కోసం నిర్మాత సాయి కొర్రపాటి ప్రయత్నించారట. కానీ రోబో 2.0 నిర్మాత శుభకరణ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని టాక్. దీంతో రాజమౌళిని తీసుకెళ్లి శుభకరణ్తో మాట్లాడించినట్టు సమాచారం. అయితే రూ.60కోట్లకు అమ్మాలని కోరగా.. శుభకరణ్ రూ.80కోట్లకు తక్కువ అమ్మేది లేదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను కొని వారాహి చిత్ర బేనర్లో తెలుగులో రిలీజ్ చేయాలని సాయి, రాజమౌళి భావించినట్టు టాక్. కానీ శుభకరణ్ రూ.80కోట్లకు తక్కువ ఇవ్వననడంతో తెలుగులో ఆ సినిమాకు రూ.60కోట్ల కంటే ఎక్కువ పెట్టి రిస్క్ చేయడం ఎందుకని రాజమౌళి తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ‘రోబో 2.0’ రైట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ రూ.81కోట్లకు దక్కించుకున్నారని తెలుస్తోంది.