శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై నారాయణ భట్ సమర్పించు చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. కన్నడ ఫేమ్స్ రాగిణీ ద్విగేది, మేఘన రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ లు నటించగా… సి. పుట్టు స్వామి నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ దర్శకుడు.. ట్రైలర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు..
ఈ నేపథ్యంలో దర్శకుడు మహేష్ మాట్లాడుతూ… కన్నడలో ఇదివరకే వచ్చిన దండు పాళ్యానికి, ఇప్పుడు నా డైరెక్షన్ లో వస్తున్న ఈ రియల్ దండుపాళ్యం కు చాలా వ్యత్యాసం ఉంది… ఈ రెండు చిత్ర కథలకు ఏమాత్రం సంబంధం లేదు.. 1980 లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది… ఎలా జరిగిందో అలానే సినిమాలో చూపించడం జరిగింది. ఇందులో 5మంది హీరోయిన్స్, ఇద్దరు హీరోలు నటించారు.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ నేను కలసి కన్నడలో 9 సినిమాలు చేశాము… అన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి… ఈ చిత్రానికి కూడా తానే ఉండాలనే ఉద్దేశ్యంతో శ్రీధర్ ను తీసుకోవడం జరిగింది. నిర్మాత పుట్టు స్వామి, చలపతిల సహకారంతోనే ఈ చిత్రం ఇంతవరకు వచ్చింది.. వారికి నా కృతఙ్ఞతలు.. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.
నిర్మాత పుట్టు స్వామి మాట్లాడుతూ... తెలుగులో ఇదివరకే 3 సినిమాలు చేశాను. అన్నీ విజయవంతం సాధించాయి… నా బ్యానర్ నుంచే విడుదల చేశాను మొదటి సారి ఇతర బ్యానర్ నుంచి రియల్ దండుపాళ్యం చిత్రాన్ని చేస్తున్నా… ఎవరూ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ వచ్చాడు… సినిమా పూర్తి అయ్యాక చూస్తే.. నేనే థ్రిల్ అయ్యా.. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.. కన్నడలో పెద్ద హీరోయిన్స్ కూతుర్లే ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోయిన్స్.. చాలా బాగా నటించారు… ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఏర్పడిన చర్యను వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ రియల్ దండుపాళ్యం కాన్సెప్ట్. సందేశాత్మక చిత్రం కనుక తెలుగు, కన్నడ భాషల్లో ఈ నెల ఆఖరున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు…
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మ్యూజికల్ స్పేస్ ఉన్న చిత్రం ఇది.. ఔట్ ఫుట్ చాలా బాగొచ్చింది.. దర్శక నిర్మాతలు నాకు ఫ్రీడమ్, నమ్మకం ఇచ్చారు… సింగర్స్ అద్భుతంగా పాడారు.. హిట్ అవుతుందని భావిస్తున్నా అన్నారు..
హీరో యువరాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, భారతీ బాబు, సుమిత్ర, మూర్తి, రఘు బట్, పద్మావసంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
రాగిణి ద్వివేది, మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీధర్. వి. సభ్రం, మాటలు-పాటలు: భారతి బాబు, పివి ఎల్ ఎన్ మూర్తి, నిర్మాత: సి. పుట్టు స్వామి, డైరెక్టర్: మహేష్.