రాధికా ఆప్టే తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషేదైనా సరే తన నటనతో అందరినీ ఆ కట్టిపడేస్తుంది. తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది. రాధికా ఆప్టే తాజాగా ‘లిబర్టీ..ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. రాధికా ఆప్టే బాలీవుడ్ , హాలీవుడ్ పరిశ్రమల్లో పనిచేయడానికి మధ్య ఉన్న తేడాపై మీడియాతో వేడిగా కామెంట్ చేసింది… “హాలీవుడ్ లో జనాలు క్రమశిక్షణ, నిబద్దతతో ఉంటారు. అంతేకాదు.. వాళ్లు సరైన టైంలో డబ్బులు ఇస్తారు. మన పని కోసం వాళ్లను అడుక్కునే అవసరం ఉండదు. ఇండియాలోలాగా హాలీవుడ్ లో పనిచేసే నటీనటులకు డబ్బు కోసం అడుక్కునే అవసరం రాద“ని చెప్పుకొచ్చింది.
ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేషన్
‘లస్ట్ స్టోరీస్’లో రాధికా ఆప్టే చేసిన నటనకు గానూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ విభాగంలో ఇంటరేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. దర్శకుడు కశ్యప్ కాంబినేషన్‌లో రూపొందిన ‘లస్ట్ స్టోరీస్’లో రాధికా ఆప్టే పెర్ఫార్మెన్స్ ఎమ్మీ అవార్డ్స్ జ్యూరీని మెప్పిస్తుందో? లేదో? చూడాలి. 47వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ ప్రదానోత్సవం నవంబర్ 25న న్యూయార్క్‌లో జరగనుంది.
సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖి నటించిన ‘స్కేర్డ్ గేమ్స్ సీజన్ 2’ ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేట్ అయింది. ‘స్కేర్డ్ గేమ్స్ సీజన్2’ను అనురాగ్ కశ్యప్, నీరజ్ ఘవ్యాన్ దర్శకత్వం వహించారు. ఈ రెండూ నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన సిరీసే కావడం విశేషం. అమెజాన్‌కు చెందిన ‘ది రీమిక్స్’ కూడా ఈ పురస్కారానికి నామినేట్ అయింది.
పొట్టి దుస్తుల్లో మాత్రమే చూస్తారు
బాలీవుడ్‌లో… ఐశ్వర్యా, కరీనాకపూర్, కత్రినాకైఫ్, ప్రియాంకా చోప్రా… టాలీవుడ్‌లో… తమన్నా, కాజల్, శ్రియా, ఛార్మి… ఇలా స్టార్ హీరోయిన్లు ఐటమ్‌సాంగ్స్‌లో మెరిసినవాళ్లే.
“ప్రత్యేక గీతాలు చేస్తాను తప్ప ఐటమ్‌సాంగ్స్ చేయను. ప్రత్యేక గీతాల్లో డ్యాన్స్ పెర్‌ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఐటమ్‌సాంగ్‌ల ఉద్దేశం మాత్రం మారిపోయింది”అని అంటోంది రాధికా ఆప్టే. స్పెషల్‌సాంగ్స్, ఐటమ్‌సాంగ్స్‌లో దేనికి ప్రాధాన్యమిస్తారని అడిగిన ప్రశ్నకు రాధికాఆప్టే సమాధానమిస్తూ…
“ఐటమ్‌సాంగ్స్‌లో మెరిసిన వారందరికీ నేను భిన్నంగా ఉండాలనుకుంటున్నా… మనల్ని నిరూపించుకోవడానికి ప్రత్యేక గీతాలు బాగా ఉపయోగపడతాయి. కానీ ఐటమ్‌సాంగ్స్‌లో అలాంటిదేమీ ఉండదు. ఇటువంటి పాటల్లో నటించే తారలను పొట్టి దుస్తుల్లో మాత్రమే చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకే వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నా”అని చెప్పింది.