ఎం.ఎస్.కె ప్రమిదశ్రీ ఫిలింస్ బ్యానర్‌పై పి.ఎస్.నారాయణ దర్శకత్వంలో ఎం.ఎస్.కె.రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘వీడు అసాధ్యుడు’. కృష్ణసాయి, జహీదా శామ్ హీరో హీరోయిన్. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి శివాజీ రాజా క్లాప్ కొట్టగా.. ఫస్ట్ షాట్ డైరెక్షన్ శివకృష్ణ, కెమెరా సిచ్చాన్ నిర్మాత సీతారామరాజు చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో…
చిత్ర దర్శకుడు పి.ఎస్.నారాయణ మాట్లాడుతూ… ”ఈ సినిమాకు హీరో, నిర్మాత ఎం.ఎస్.కె.రాజుగారే. ఆయనతో పదేళ్ల పరిచయం నాది. తిరుపతిలో క్రిమినల్ లాయర్‌గా పని చేసే ఆయన సినిమా నిర్మించాలనే కోరికతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. హీరోగా మాత్రం కృష్ణసాయి అనే స్క్రీన్ నేమ్‌ను పెట్టుకున్నారు. నేను ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. హీరోయిన్ జహీదా కాశ్మీర్ అమ్మాయి. కన్నడ, తెలుగులో మూడు సినిమాలు చేసింది. ఈ చిత్రంలో ఎన్.ఆర్.ఐ పాత్రలో నటిస్తున్నారు. కమర్షియల్ అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నాం” అన్నారు.
ఎం.ఎస్.కె.రాజు మాట్లాడుతూ… ”ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చాను. కృష్ణ సాయి అనే స్క్రీన్ నేమ్‌తో హీరోగా పరిచయం అవుతున్నాను. పదేళ్లుగా పరిచయం ఉన్న నారాయణగారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది. పోలీసుల కోసం అప్పట్లో మేం చేసిన పాటకు మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. మంచి కంటెంట్‌తో కమర్షియల్ కథాంశంతో పాటు సామాజిక స్పృహ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు” అన్నారు.
జహీదా శామ్ మాట్లాడుతూ … ”మంచి పాత్ర చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: శంభుప్రసాద్, మాటలు: త్యాగరాజు, కెమెరా: విజయ్‌కుమార్ అడుసుమిల్లి, ఆర్ట్: పి.వి.రాజు, ఎడిటర్: మురళి, నిర్మాత: ఎం.ఎస్.కె.రాజు, కథ, కథనం, దర్శకత్వం: పి.ఎస్.నారాయణ.