‘ది స్కై ఈ పింక్’…వివాహం తర్వాత ప్రియాంక చోప్రా చేసిన సినిమా’ ది స్కై ఈజ్ పింక్’. ఈ సినిమాలో ఆనందం, విషాదం రెండూ సమాంతరంగా ఉంటాయని చెప్పిందామె. ఇటీవల ప్రియాంక టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. అక్కడ ఈ సినిమాను ప్రదర్శించారు. ఆమె ఈ చిత్రంలో 15ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించింది. ఆ పాత్రను ప్రియాంక పోషించిన మెళకువలు.. ఆ పాత్ర వల్ల నేర్చుకున్న విషయాలను చెప్పింది. ఇందులో ఐషా తల్లి అదితి పాత్రలో ప్రియాంక కనిపించనుంది. ఈ సందర్భంగా ఆమె తల్లికూతుళ్ల పాత్రలను వివరించింది….
”మొదటిసారి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ బంధం అలా ఉంటుంది. పెళ్లి చేసుకున్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు… పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు..నువ్వు వాళ్లకి సపర్యలు చేసినప్పుడు.. ఆ బంధంలో జరిగే పరిణామాలు? ఆ బంధాన్ని ఎలా కొనసాగిస్తావు? అందులో నష్టం,కష్టం అంతా తల్లి పైనే ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ సినిమా ప్రతి క్షణం ఉత్కంఠగా ఉంటుంది” అని చెప్పింది.
ఈ కథ ఐషా కోణంలో చెప్పినప్పుడు చాలా ప్రత్యేకమని పేర్కొంది ప్రియాంక. ‘ఆనందకరమైన సన్నివేశాలు, విషాద ఘట్టాలు అన్ని కలపితేనే ఈ టీనేజర్(ఐషా). ఈ కథలో ఒక పక్క ఆమె మరణిస్తుందని చెబుతూనే, మరో పక్క ఆమె ప్రతిభను ఆవిష్కరించారు” అని తెలిపింది ప్రియాంక. పర్హాన్ అక్తర్ ఐషా తండ్రి పాత్రలో నటించారు.ఈ చిత్రానికి సోనాలి బోస్ దర్శకత్వం వహించారు.. ఐషా పాత్రలో జైరా వాసిమ్ నటించింది. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక చోప్రా ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ కూడా.
ఈ మాటలే ఆమెకు స్ఫూర్తి
ప్రియాంక ఇప్పుడు గోబల్ ఐకాన్‌గా మారింది. ‘క్వాంటికో’ సిరీస్‌లో భాగంగా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ..ఇటు బాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. ఆమె మిస్ వరల్డ్ టైటిల్ గెలిచినప్పుడు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొందో వివరించింది ప్రియాంక. తనను సినిమాల్లోకి రాకుండా చేయాలని దర్శకులు చూశారని చెప్పింది. ఇలా దర్శకులంతా తనను ఇండిస్టీలోకి అడుగుపెట్టకుండా చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమెకు తండ్రి డా.అశోక్ చోప్రా చెప్పిన.. ‘చాలా మంది యువత ఎక్కువగా మాట్లాడుతుంటుంది. కొంత మాత్రం వింటారు. చాలా తక్కువ మంది నేర్చుకుంటారు” అన్న మాటలే గుర్తొచ్చాయట. ఈ మాటల నుంచి ఆమె స్ఫూర్తిని పొంది తన అపజయాల నుంచి విజయాలకు దూసుకెళ్లినట్టు వెల్లడించింది.
ఆమె జీవిత కథే ‘ ది స్కై ఈజ్ పింక్’
కళ్ల ముందు ముద్దుల కూతురు తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి వేదికలపై మాట్లాడి ..అందరినీ స్ఫూర్తివంతం చేసినప్పుడు…15 ఏళ్లకే గొప్ప రచయితగా పేరు తెచ్చుకుంటే… ఆ సంతోషానికి అవధులుండవు. కానీ ‘అదే చిట్టి తల్లి ఎంతోకాలం బతకదు’ అని తెలిస్తే ఆ బాధను వర్ణించలేం. ఇదే జరిగింది నిరెన్ చౌదరి, అదితి దంపతుల కుమార్తె విషయంలో. నిరెన్ చౌదరి యమ్ బ్రాండ్ సౌత్ ఆసియన్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్. అదితి మెంటల్ హెల్త్ కేర్ వర్కర్. వీరికి ఐషా, ఇషా ఇద్దరు పిల్లలు. ఇందులో ఐషా వ్యాధి నిరోధక శక్తి లోపంతో పుట్టింది. అయినా ఈ అమ్మాయి చాలా తెలివైంది. దేశంలోనే తెలివైన చిన్నారిగా నిలిచింది కూడా. కానీ పుట్టిన 6 నెలల్లోనే బోన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఆమె రాసిన పుస్తకం రేపు ప్రచురిస్తారనగా ముందు రోజు ఆ చిన్నారి మృతి చెందింది. అప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు. ఈమె జీవిత కథే ‘ ది స్కై ఈజ్ పింక్’