ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘బేవాచ్’ చెత్తసినిమాల జాబితాలో టాప్‌లో నిలిచింది. ప్రతి ఏడాది చెత్త సినిమాలకు ర్యాంకులనిచ్చే గోల్డెన్ రాస్‌బెర్రి ‘వరస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో 2017 ఏడాదికిగానూ ‘బేవాచ్’ ఎంపికైంది. చెత్త సినిమా, చెత్త స్క్రీన్ ప్లే, చెత్త రీమేక్, సీక్వెల్, చెత్త నటుడు కేటగిరీల్లో ‘బేవాచ్’ను ఎంపిక చేశారు.
ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ లు జంటగా తెరకెక్కిన ‘బేవాచ్’ గత ఏడాది మే లో రిలీజ్ అయ్యింది. అయితే బుల్లితెర మీద ఘనవిజయం సాధించిన ఈ స్టోరి వెండితెర మీద మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ‘బేవాచ్’ ఫ్లాప్ అయినా అందులో ప్రియాంక నటనకు మంచి మార్కులేపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన ‘క్వాంటికో’ సిరీస్‌లోనూ తన నటనతో ప్రియాంక అంతర్జాతీయ స్థాయిలో స్టార్ స్టేటస్ అందుకున్న విషయం తెలిసిందే.
చెత్త సినిమా విభాగంలో నామినీలు
బేవాచ్
ది ఈమోజీ మూవీ
ఫిఫ్టీ షేడ్స్ డార్కర్
ది మమ్మీ
ట్రాన్స్ ఫార్మర్స్ : ది లాస్ట్ నైట్