ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టేలా ఆ నాలుగు పాత్రలు !

“పాటలు, డాన్సులు ఎక్కడైనా ఉంటాయి. కానీ అంతకు మించి భారతీయ సినిమాలని మిస్‌ అయ్యాను” అని ప్రియాంక చోప్రా అంటోంది. ‘జై గంగాజల్‌’ తర్వాత మరే భారతీయ సినిమాకి ప్రియాంక అంగీకరించలేదు. దాదాపు మూడేండ్ల తర్వాత ఇప్పుడు ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తోంది. సోనాలీ బోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఫర్హాన్‌ అక్తర్‌ హీరో. జహీరా వసీమ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో …’ఇన్నేండ్లలో ఏం కోల్పోయారు?’ అనే ప్రశ్నకి ప్రియాంక స్పందిస్తూ… ‘వినోదం ఎక్కడైనా ఉంటుంది. హాలీవుడ్‌ అయినా, బాలీవుడ్‌ అయినా ఒకేలా ఉంటుంది. కానీ భాషలే వేరు. పనిచేసే స్థలం వేరు. అయినప్పటికీ బాలీవుడ్‌లో గ్యాప్‌ రావడంతో ఏదో మిస్సైన ఫీలింగ్‌ కలుగుతుంది. గ్యాప్‌ని తప్పకుండా త్వరలోనే ఫిల్‌ చేస్తాను’ అని తెలిపింది.
మిస్ వరల్డ్ టైటిల్ విజేతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రియాంకచోప్రా హిందీ చిత్రసీమలో అగ్ర నాయికగా పేరు తెచ్చుకుంది. ఆపై హాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడ కూడా విజయకేతనాన్ని ఎగరేసింది. ఇటీవలే హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్‌జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
విడుద‌ల‌కి సిద్ధంగా ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’
‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ పాత్ర‌లు ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టేలా ఉంటాయ‌ని అంటున్నారు. ప్రియాంక త‌ల్లిగా జ‌రీనా న‌టిస్తుంది.
 
చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్‌ చెప్పినా మోటివేషనల్‌ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథని తీసుకొని ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు . ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ప్రియాంక చోప్రాలు 2005లో ‘దిల్ ద‌ఢ్‌ఖ‌నే దో’ అనే చిత్రంతో తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ‘ది స్కైజ్ ఈజ్‌ పింక్’ వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న‌ రెండో చిత్రం. ప్రియాంక న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం ఆ మూవీ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది ప్రియాంక‌.