ప్రియా ప్రకాశ్ వారియర్… కన్నుగీటి కోట్లాది ప్రజల హృదయాలని కొల్లగొట్టిన అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చింది . ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో రిలీజ్ కానుంది. ప్రియ ప్రశాంత్ మంబుల్లి దర్శకత్వం లో నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ విడుదలకుముందే వివాదాల పాలయ్యింది. అయితే ప్రియా ప్రకాశ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నప్పటికి దీనిపై క్లారిటీ రావడం లేదు. ఆ మధ్య బన్నీతో చేయనుందని వార్తలు రాగా, తాజాగా నాని సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుందని అంటున్నారు.
ఇటీవల సక్సెస్ విషయంలో కాస్త తడబడుతున్న యంగ్ హీరో నాని వరుసగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. నాని ప్రస్తుతం ‘మళ్లీరావా’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ కానుంది. జెర్సీ రిలీజ్ తర్వాత నాని.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్‌ని కథానాయికగా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తుందట. ప్రియా కూడా నాని సరసన నటించేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
కొట్టీ కొట్టీ బోర్ కొడుతోంది !
తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ప్రియా.. తాను ఇప్పటికే 200 సార్లు కన్ను కొట్టానని తెలిపింది. ఎక్కడికి వెళ్లినా కన్ను కొట్టమనే అడుగుతున్నారని.. అలా కొట్టీ కొట్టీ బోర్ కొడుతోందని చెప్పింది ప్రియా. అయితే తాను కన్ను కొట్టడం ఇంతలా ఎందుకు ఫేమస్ అయిందో తనకే అర్థం కావటం లేదని ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది. కన్ను కొట్టి ఫేమస్ అవటం సంతోషంగా ఉన్నా ప్రైవసీ కోల్పోయిన విషయం మాత్రం వాస్తవమేనని తెలిపింది ప్రియా.