‘బాహుబలి’ (ది బిగినింగ్) సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ‘బాహుబలి’ (ది కంక్లూజన్) తో టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచానికే పరిచయం చేసాడు. ఓ తెలుగు సినిమా ఇలాంటి ఘనత సాధిస్తుందని ఎవరు ఎప్పుడు ఊహించలేదు కూడా. ఏ ఇండియన్ సినిమా సాధించని రికార్డు ‘బాహుబలి 2’ సాధించి అందరు ముక్కున వేలేసుకునేలా చేసింది. 1600 కోట్లకి పైగా వసూళ్ళు సాధించిన ఈ చిత్రం త్వరలో చైనాలోను విడుదలఅయ్యింది
‘బాహుబలి’ ని తెరకెక్కించకముందు రాజమౌళి ఈ చిత్రాన్ని ఒకే పార్టుగా విడుదల చేయాలని భావించాడు. కాని నిడివి పెరుగుతుండడంతో రెండు భాగాలుగా తీయక తప్పలేదు. ఈ రెండు భాగాలు సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. అయితే ఇప్పుడు ‘బాహుబలి’ రెండు పార్టులు ఒకే పార్టుగా థియేటర్స్ లోకి రానున్నట్టు తెలుస్తుంది. ‘బాహుబలి’ ది బిగినింగ్ ,’బాహుబలి’ ది కంక్లూజన్ రెండింటిని కలిపి ఒకే పార్టుగా ఇంటర్నేషనల్ వెర్షన్ ఇంగ్లిష్ లో రెడీ అవుతుందట.మరి అభిమానులు ఈ థ్రిల్ ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధం కండి.
ఇప్పటికే మోస్ట్ టాలెంటెడ్ ఎడిటర్, ‘హల్క్’ ఫేమ్ విన్సెంట్ టబైల్లోన్ ని సంప్రదించినట్టు తెలుస్తుండగా , దాదాపు 5 గంటల 20 నిమిషాల వ్యవధి ఉన్న ఈ రెండు భాగాలని మూడు గంటలుగా ట్రిమ్ చేస్తారట. అవసరం లేవనుకున్న సన్నివేశాలతో పాటు కొన్ని పాటలని కూడా తొలగించి ఇంటర్నేషనల్ వర్షెన్ ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ సింగిల్ పార్ట్ మొత్తం ఇంగ్లీష్ లో భాషలోకి అనువదించబడుతుండగా, ఈ ఏడాదే పలు దేశాలలో రిలీజ్ కానుంది.