‘సాహో’ కు ఈ సినిమాకు ప్రభాస్ దిమ్మ తిరిగిపోయే రెమ్యూనేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావటం. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో భారీ బడ్జెట్‌తో చేసిన సినిమా కావటంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా సాహోకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.సాధారణంగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు అధికారికంగా బయటకు రావు. అయితే సాహో కు ఈ సినిమాకు ప్రభాస్ దిమ్మ తిరిగిపోయే రెమ్యూనేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇంతవరకూ పారితోషికం తీసుకోని యంగ్ రెబల్ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 50 శాతం వాటా తన పారితోషికంగా తీసుకోనున్నాడట.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ వందకోట్లకు పై మాటే అన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల సరసన ప్రభాస్ నిలవనున్నాడు. అంతేకాదు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ల కన్నా ప్రభాస్ రెమ్యూనరేషనే ఎక్కువ అవుతుంది.
ప్రభాస్ డార్లింగ్ లుక్‌లో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ ఆగస్లు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్, సాంగ్ టీజర్‌లతో అలరించిన చిత్రయూనిట్ తాజాగా రెండో పాటకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.ఈ పాటలో ప్రభాస్ డార్లింగ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాటకు గురు రణ్‌ధవ సంగీతమందించగా కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్‌లు ఆలపించారు.
సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాడేలతో పాటు వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.