ఎప్పటి నుంచో ప్రభాస్ పెళ్లి పైన చాలా గాసిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సినీ ఇండస్ట్రీలో అప్పుడే కాదు ఇప్పుడు కూడా ప్రభాస్ పెళ్లి గురించే చర్చ. ఇదివరకు బాహుబలి రెండు పార్టులు పూర్తయ్యాక ప్రభాస్ పెళ్లి ఉంటుందన్నారు. కాని.. ‘బాహుబలి’ రెండు పార్ట్స్ షూటింగ్స్ అయిపోగానే… ‘సాహో’ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా ప్రభాస్ తన మ్యారేజ్ గురించి ఏం చెప్పలేదు.
అయితే.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం ఓ వార్త తెగ హల్ చల్ చేసింది. ప్రభాస్.. తన సహ నటి అనుష్కతో రిలేషన్షిప్లో ఉన్నాడనేది ఆ వార్త సారాంశం. ఆ వార్తకు బలం చేకూర్చుతూ ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సింధు తాజాగా తన ట్విట్టర్లో ఓ ట్విట్ చేసి ప్రభాస్, అనుష్క ప్రేమ గురించి చెప్పి ఇంకో పెద్ద షాక్ ఇచ్చాడు. ‘డిసెంబర్లో ప్రభాస్, అనుష్కల ఎంగేజ్ మెంట్ ఉందని.. వారిద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్త నిజమని’ ఆయన అన్నాడు. ప్రభాస్, అనుష్క క్లోజ్ ఫ్రెండ్ ఒకరు తనకు చెప్పిన వివరాల ప్రకారం ….తను ఈ వార్తను ప్రభాస్, అనుష్క అభిమానులకు తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్ పెళ్లిపై సోషల్ మీడియాలో తెగ వార్తలు పుట్టుకొస్తున్నాయి.
ఈ వార్త ప్రభాస్‌కు చేరడంతో స్పందించాడు ప్రభాస్….. “నాకే ఆశ్చర్యంగా ఉంది. అనుష్క నాకు గత 9 సంవత్సరాలుగా తెలుసు. మీము మంచి ఫ్రెండ్స్. అంతే.. ఐదు సినిమాల్లో కలిసి వర్క్ చేశాం. ఈ రూమర్స్ చూస్తుంటే నిజంగానే మా ఇద్దరి మధ్య ఏదైనా ఉందేమోననే డౌట్ వస్తోంది. అయితే.. సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి రూమర్స్ రావడం సహజం. ఒక హీరోయిన్.. హీరోతో కలిసి ఓ సినిమాలో పనిచేస్తే వాళ్లిద్దరికీ లింక్ పెట్టడం కామన్. ఇదేం కొత్త కాదు. మా ఇద్దరి మధ్యా ఏం లేదు. ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది” అని ప్రభాస్ వివరించాడు. దీంతో ఫిలిం క్రిటిక్ ఉమైర్ సింధు ట్వీట్ల సంచలనం సద్దుమణిగింది