ప్రభాస్‌కి తెలుగులోనే కాదు యావత్ ప్రపంచంలో ఇప్పుడు అభిమానులు ఉన్నారు.నార్త్‌లో ప్రభాస్ యాక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. అందుకే ప్రభాస్‌తో ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజిలోనే తెరకెక్కించాడనికి ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం నార్త్‌లోనే కాదు నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా ప్రభాస్ క్రేజ్‌కి సాటి లేదు. ప్రభాష్ శ్రీరాముడు గా నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం వార్త మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇందులో కీర్తి సురేష్ సీతగా,సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను 2021లో ప్రారంభించి 2022లో విడుదల చేస్తామని దర్శకుడు ఓంరౌత్ తెలిపారు. ఇంత భారీస్థాయి చిత్రం ఇంత తక్కువ సమయంలో ఎలా తీసుకొస్తారా? అని అంతా ఆశ్చర్యపోయారు. దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్‌ను ‘ఆదిపురుష్’ చిత్రం కోసం కేవలం 70 రోజుల కాల్షీట్లు మాత్రమే అడిగాడట. ఈ 70 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమాను మొత్తం గ్రీన్ స్క్రీన్‌పై షూట్ చేయబోతున్నారు. సినిమాలో చాలా క్యారెక్టర్లను కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందిస్తారు. దీంతో అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని ఓం రౌత్ ప్రభాస్‌కు వివరించాడట. అంతకుముందు అక్షయకుమార్ హీరోగా ‘తాన్హజీ’ చిత్రాన్ని కూడా తక్కువ బడ్జెట్‌తో, తక్కువ సమయంలో ఓం రౌత్ నిర్మించారు.
‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ విలు విద్య శిక్షణ !
ప్రభాస్ ప్రకటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ కోసం సిద్దమౌతున్నాడు. ఈ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్ బాణాలు సంధించనున్నాడు. ఇందుకోసం విలు విద్యపై దృష్టిపెట్టనున్నాడు. ‘బహుబలి’ సినిమాలోనూ బాణం, విల్లంబు ధరించి అలరించిన ప్రభాస్ ‘ఆదిపురుష్’లో విలు విద్యను ప్రదర్శించాల్సి ఉంది. అందుకోసం ప్రభాస్ పూర్తిస్థాయిలో విలువిద్యలో శిక్షణ తీసుకోబోతున్నాడని దర్శకుడు ఓంరౌత్ చెప్పారు. బాలీవుడ్‌లో ఎందరో హీరోలు ఉండగా ప్రభాస్‌నే ‘ఆదిపురుష్’లో తీసుకోవడానికి కారణమేంటని అడిగితే… ప్రభాస్ మాత్రమే ఈ పాత్ర చేయగలడని ఓంరౌత్ అన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు.. ఇలా ప్రభాస్‌లో ‘అదిపురుష్’ పాత్రను తాను చూశారని ఓంరౌత్ చెప్పారు.
ఎపిక్ డ్రామాగా, గ్రాఫిక్స్ హంగులతో…
ప్రభాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ నటిస్తున్న చిత్రం ‘ఆది పురుష్’. ఆయన నటిస్తున్న 22వ చిత్రమిది. “చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీక”గా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు తెలియజేసారు.
గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై మైతిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు.
‘బాహుబలి’ సిరీస్, ‘సాహో’, ‘రాథే శ్యామ్’, ప్రభాస్ 21వ సినిమా మాదిరిగానే ప్రభాస్ 22వ సినిమా ‘ఆదిపురుష్’ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించి వివిధ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ‘సాహో’, ‘రాథే శ్యామ్’ తరువాత వరసగా మూడోసారి ప్రముఖ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టిసిరీస్‌తో కలిసి ప్రభాస్ పని చేస్తున్నారు. ఈ ‘ఆది పురుష్’ ఓ ఎపిక్ డ్రామాగా, గ్రాఫిక్స్ హంగులతో రెడీ అవ్వబోతోంది’ అని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తెలిపారు.