త్వర త్వరగా సినిమాలు పూర్తి చేస్తూ … రాజకీయ రంగ ప్రవేశానికి దగ్గరవుతున్న పవన్ కళ్యాణ్ ఆ హడావుడిలో సినిమాల క్వాలిటీ లో వెనుక బడిపోతున్నాడు . అందుకే పరాజయాలు చవిచూస్తున్నాడు. పవన్‌కల్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ ఉంటాయి. పవన్ సినిమాను ఎంత రేటు పెట్టి కొనడానికైనా ముందుకొస్తుంటారు బయ్యర్లు .సాధారణంగా ఒక హీరో వరుసగా నటించిన రెండు సినిమాలు ఫ్లాప్లైతే తర్వాతి సినిమా మీద పెద్దగా అంచనాలుండవు. బయ్యర్లు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనడానికి భయపడుతుంటారు. అయితే పవన్-త్రివిక్రమ్ తాజా సినిమా మాత్రం రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిందట.కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నటిస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 90 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మహేష్ ‘స్పైడర్’, వరుస విజయాల మీదున్న ఎన్టీయార్ ‘జైలవకుశ’కు కూడా ఇంత బిజినెస్ జరగడం లేదట. అందుకనే పవన్ పవర్ స్టార్ !… ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో పవన్‌ను మించిన హీరో లేడని టాలీవుడ్లో టాక్ …
40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట !
ఈ చిత్రం తర్వాత పవన్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం కోసం పవన్ దాదాపు 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట. అంతేకాదు ఈ చిత్రాన్ని కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలనే యోచనలోనూ ఆయన ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆక్టోబర్‌లో విడుదల కానుంది. నవంబర్‌లో సంతోష్ శ్రీనివాస్ సినిమా ప్రారంభించి వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాలని పవన్ భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీని ఆయన బలోపేతం చేసే పనిలోనూ ఉన్నారు. దీంతో పవన్ నటించే చివరి చిత్రం సంతోష్ శ్రీనివాస్‌దే అయ్యే అవకాశం ఉందని అంటున్నారు .