బిజీగా ఉండటానికి, ఆనందంగా గడపటానికీ సంబంధం లేదని అంటోంది పూజా హెగ్డే. ఆమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది. మనసుకు సంతోషం కలిగించే అంశాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలని సూచిస్తోంది పూజ. దీని గురించి పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో … ‘‘ఆనందంగా ఉండటానికి కారణాలు వెతకండి. తప్పకుండా ఎక్కడో ఓ చోట మిమ్మల్ని సంతోషపరిచే అంశం ఉండనే ఉంటుంది. దాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టండి. దాని రుచి తెలిసిన తర్వాత, ఈ జీవితంలో అంతకు మించి మీరు కోరుకునేది ఇంకేదీ ఉండదు. నేను ప్రామిస్ చేస్తున్నా! ’’ అని అన్నారు. మహేశ్ సరసన ఆమె నటిస్తున్న చిత్రం ‘మహర్షి’లో ‘చోటి చోటి’ సింగిల్ ఇటీవల విడుదలైంది. ఈ పాటను ప్రస్తావిస్తూ ‘‘ఫ్రెండ్స్‌తో గడిపిన తియ్యటి క్షణాలు లేకపోతే ఈ జీవితమెందుకు?’’ అని పోస్ట్ చేశారు
పూజా హెగ్డే తెలుగులో అగ్రతారగా ఎదిగింది. ఇప్పుడు మహేశ్ బాబుతో ‘మహర్షి’ చిత్రంలో చేస్తోంది. త్వరలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోనూ కథానాయికగా నటించబోతోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. మరో పక్క బాలీవుడ్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. హృతిక్ రోషన్‌తో కలసి గతంలో ‘మొహెంజోదరో’ చిత్రంలో నటించింది. ఆ సినిమా కోసం తీవ్రంగా శ్రమించింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద పరాజయాన్ని పొందింది. ఏకంగా రెండేళ్లు పాటు ఈ చిత్రానికి పనిచేసింది. ఓ నటి తన కెరీర్‌లో రెండేళ్లు కేటాయించిందంటే ఆ సినిమాపై ఎక్కువ అంచనాలు ఉంటేనే అలా చేయగలదు. దీనిపై ఇటీవల స్పందిస్తూ…సమయాన్ని వృథా చేసుకున్నానని ఆవేదన చెందింది.
ఆ మూడు చిత్రాల్లోనూ కథానాయికగా…
పూజా హెగ్డే ఇప్పుడు ‘హౌస్‌ఫుల్ 4’లో నటిస్తోంది. ఈ చిత్రానికి సాజిద్ నదియాద్వాలా నిర్మాత. ఆ సినిమా సెట్స్‌లో పూజా తన నటనతో నిర్మాతను ఇంప్రెస్ చేసిందట. దీంతో ఆయన భవిష్యత్తులో చేయబోయే మూడు చిత్రాల్లో పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా కథలు కూడా నచ్చడంతో కథానాయికగా చేసేందుకు పూజా కమిట్ అయింది కూడా. ఈ సినిమాలతో బాలీవుడ్‌లో ఈమె కెరీర్ ఓ స్థాయికి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటితో పాటు ప్రభుదేవాతో కలసి ఓ సినిమా చేయబోతోంది. ఆ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దశలో ఉంది