యాక్షన్ హీరోయిన్ గా హాలీవుడ్ రీమేక్ లో…

పూజా హెగ్డే తెలుగులో ఇప్పటికే ‘డీజే’లో అల్లు అర్జున్‌తో, ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్‌తో కలిసి నటించింది. ఇప్పుడు ‘మహర్షి’లో మహేష్‌ సరసన, రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో
ప్రభాస్‌ సరసన, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. అదే మాదిరిగా బాలీవుడ్‌లోనూ బంపర్‌ ఆఫర్స్‌ అందుకుంటోంది. హిందీలోకి అడుగుపెడుతూనే హృతిక్‌ రోషన్‌ సరసన ‘మొహెంజోదారో’లో నటించి మెప్పించింది. అక్షయ్ కుమార్‌ సరసన ‘హౌస్‌ఫుల్‌ 4’లో నటించగా, తాజాగా మరో రెండు ఆఫర్స్‌ అందుకున్నట్టు తెలుస్తుంది. నిర్మాత సాజిద్‌ నడియడ్‌వాలాతో ఆమె మూడు సినిమాలకు సైన్‌ చేశారు. ఇప్పటికే ‘హౌస్‌ఫుల్‌ 4’లో నటించగా, మరో రెండు ప్రాజెక్ట్‌లకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. అందులో ఒకటి యాక్షన్‌ జోనర్‌లో ఉంటుందట. ఏంజెలినా జోలీ నటించిన ‘టాంబ్‌ రైడర్‌’ చిత్రం ఆధారంగా రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది. ‘మొదటిసారి పూజా హెగ్డే తన కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటపడుతోంది. కూల్‌ యాక్షన్‌ సినిమా చేస్తోంది. నటనకు స్కోప్‌ ఉంది. హాలీవుడ్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ‘టాంబ్‌ రైడర్‌’ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది’ అని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.
 
బతకడానికి చాలా ముఖ్యమైంది అదే !
ఆర్టిస్ట్‌గా ఈ నాలుగేళ్లలో ఏం నేర్చుకున్నారు?…అని పూజా హెగ్డే ని అడిగితే…
“నేను స్టార్‌ అదీ ఇదీ అని ఏదో గొప్పగా ఫీల్‌ అవ్వను. నార్మల్‌ అమ్మాయిలానే ఫీల్‌ అవుతాను. ఈ ఐదేళ్లల్లో నేను తెలుసుకున్నదేంటంటే… ఆర్టిస్ట్‌గా కంటిన్యూ కావాలంటే చాలా సహనం కావాలి. అసలు ఈ ప్రపంచంలో బతకడానికి చాలా ముఖ్యమైంది అదే అనుకుంటా. ఇక నా ప్రొఫెషన్‌ విషయానికి వస్తే.. ‘ఓర్పు’ అనేది చాలా చాలా ముఖ్యం. మేకప్‌ చేసుకోవాలి. ప్రతి షాట్‌కి మధ్య గ్యాప్‌.. లొకేషన్‌లో వేరే ఆర్టిస్టుల కాంబినేషన్‌ సీన్స్‌ తీసేటప్పుడు షాట్‌కి వెయిటింగ్, మేకప్‌… ఇలా ప్రతి దాని ముందు చాలా వెయిటింగ్‌ ఉంటుంది. ఆ వెయిటింగ్‌ని తట్టుకోవాలి.
 
హిట్స్‌.. ఫ్లాప్స్‌ని ఎలా తీసుకుంటారు? …అని అడిగితే….
“ఫస్ట్‌ సినిమా నుంచి ఇప్పటివరకూ నేనే పాత్ర చేసినా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. యాక్టర్‌గా ‘పూజా కరెక్ట్‌గా చేయలేదు’ అనే నెగటివ్‌ రివ్యూ చదవలేదు. సినిమా రిజల్ట్‌ మన చేతుల్లో ఉండదు. మనం డిసైడ్‌ చేయలేం. అన్ని సినిమాలు బాగా ఆడాలనుకుంటాం. అలా జరగదు. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఏం చెయ్యగలం? అందుకే ఫ్లాప్‌ అనేది నన్ను పెద్దగా ఎఫెక్ట్‌ చేయదు”