‘ ఒకరి జీవితంలో మంచి మార్పు తెచ్చే స్థితిలో నన్ను చేర్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు. చిన్నదో.. పెద్దదో.. ఏదో ఒకటి సమాజానికి చేయాలన్నదే నా ఆశయం. సమాజం మనకు ఎంతో ఇచ్చినప్పుడు మనం కూడా తిరిగి ఇవ్వాలి’’ అని అంటున్నారు పూజా హెగ్డే. అందుకే ‘ఆల్ ఎబౌట్ లవ్’ అనే ఫౌండేషన్‌ను ఆరంభించారు. పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘సమాజానికి సేవ చేయడానికి ‘ఆల్ ఎబౌట్ లవ్’ ఓ చిన్న మార్గంలా భావిస్తున్నాను. ఒకరి జీవితంలో మంచి మార్పు తెచ్చే స్థితిలో నన్ను చేర్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు. చిన్నదో.. పెద్దదో.. ఏదో ఒకటి సమాజానికి చేయాలన్నదే నా ఆశయం. ప్రేమ అనేది ఒక శక్తిమంతమైన భావోద్వేగం అని నమ్ముతాను. ప్రేమతో చేసే ఏ సేవ అయినా ప్రపంచంలో మంచి మార్పుకి కారణం అవుతుందని కూడా నమ్ముతాను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి, వైద్య సహాయం కావాలనుకున్నవారికి నా ఫౌండేషన్ హెల్ప్ చేస్తుంది’’ అన్నారు. ఈ ఫౌండేషన్ స్థాపనకు ముందే తన సొంత పట్టణం మంగళూరులో పలు సేవా కార్యక్రమాల్లో భాగమైంది పూజాహెగ్డే. క్యాన్సర్‌తో బాధపడుతున్న కొందరు చిన్నారుల వైద్య ఖర్చులను భరించడంతో పాటు.. వందమంది దినసరి కూలీలకు నెలకు సరిపోయే నిత్యావసర వస్తువుల్ని అందించింది. కోమాలోకి వెళ్లిపోయిన ఓ వ్యక్తి కుటుంబ ఆర్థిక అవసరాల్ని తీర్చే బాధ్యతను కూడా పూజాహెగ్డే తీసుకుంది. వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ విరామ సమయాల్ని ఫౌండేషన్ కార్యకలాపాల కోసం వెచ్చిస్తానని ఆమె పేర్కొంది.
పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే… తెలుగులో ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, తమిళంలో విజయ్ ‘బీస్ట్’, హిందీలో రణవీర్ సింగ్ ‘సర్కస్’, సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్…కభీ దీవాలి’ చిత్రంలోనూ చేస్తున్నారామె. అలాగే ఎన్టీఆర్–కొరటాల శివ సినిమాలో, రామ్‌చరణ్– శంకర్ సినిమాలో, ధనుష్–శేఖర్ కమ్ముల చిత్రంలోనూ, పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ తీయబోతున్న సినిమాలోనూ పూజా హెగ్డే కథానాయిక అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఏకంగా రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్… ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది పూజా హెగ్డే. పూజా స్పీడ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ హిట్‌తో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్నవి దాదాపు పాన్ ఇండియా సినిమాలే. దీంతో పూజా హెగ్డే తన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట. తాజాగా నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్న ఓ సినిమాకు పూజా సైన్ చేసినట్లు సమాచారం. ఈ మూవీకి గాను ఏకంగా రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. ఇందుకు నిర్మాతలు కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే దక్షిణాదిన భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల లిస్ట్‌లో పూజా హెగ్డే కూడా చేరిపోయింది.