‘‘గెలుపు వచ్చాక ‘ఇది నా సొంతం’ అని ఎంత నమ్మకంగా చెబుతామో.. ఓటమికి కూడా అలానే బాధ్యత వహించాలి. రెండింటినీ ఒకేలా చూసినప్పుడు మాత్రమే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం. నా తొలి చిత్రం ఫ్లాప్ అయినప్పుడు నా మానసిక స్థితి నాకు తెలుసు. అందులోంచి బయటకు రావడానికి చాలా కాలం పట్టింది. ఆ తరవాత ఓటమిని ఆహ్వానించడం అలవాటు చేసుకున్నా’’ అంటోంది పూజా హెగ్డే. దక్షిణాదిలోనే ఇప్పుడు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికల్లో పూజా ఒకరు. “మన జయాపజయాలకు మనమే బాధ్యులం. గెలిస్తే సంబరాలు చేసుకోవడానికి చాలామంది వస్తారు. ఓటమి మాత్రం ఒంటరిదే. ఎవరూ జాలి పడరు. చిత్రసీమలో మన స్థాయి ఏమిటన్నది మన విజయాలే నిర్ణయిస్తాయి. అదృష్టం కంటే.. ప్రతిభే శాశ్వతం” అని చెబుతోంది పూజా.
‘హార్డ్ వర్క్ మన కలల్ని నెరవేర్చుతుంది’… ఈ విషయం నేను అమ్మాయిలకు చెప్పదలచుకున్నా. కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు. దక్షిణాదికి చెందిన ఒక సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా నా కలలను నేను నెరవేర్చుకుంటున్నాను.హార్డ్‌వర్క్ మన కలల్ని నెరవేర్చుతుందని అమ్మాయిలకు చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయంలో చిన్నపిల్లలకు కూడా ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. అమ్మాయిలూ..మిమ్మల్ని మీరు నమ్మండి. కలలు కనండి. మీ హార్డ్‌వర్క్ ద్వారా అవి నెరవేరినప్పుడు ఆ కలలకు ఓవిలువ ఉంటుంది. మీరు ఏ వృత్తి ఎంచుకున్నా వంద శాతం కష్టపడండి. ఫలితం తప్పకుండా ఉంటుంది.