‘ఆర్‌ఎక్స్ 100’లో ఇందూ పాత్ర అంగీకరించేటప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలైన మాట వాస్తవం. ఇందూ క్యారెక్టర్ విన్నప్పుడు ‘ఓమై గాడ్’ అనుకున్నాను….అని అంటోంది ‘ఆర్‌ఎక్స్ 100’లో నాయికగా నటించి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్‌పుత్.
‘ఆర్‌ఎక్స్ 100’లో ఇందూ పాత్ర పక్కింటి అమ్మాయి లాంటి పాత్ర కాదు. తెస్తే మంచి పేరు తేవొచ్చు.. లేదా నా పేరు చెడగొట్టొచ్చు. తెలుగులో ఆరంభ చిత్రంలోనే పూర్తిస్థాయి నెగెటివ్ రోల్ పోషించడమంటే… అది ప్రమాదకరమైన నిర్ణయం కావచ్చు. పైగా సినిమాలో శృంగార దృశ్యాలు కూడా ఆలోచింపజేశాయి. మాది సాంప్రదాయికమైన పంజాబీ ఫ్యామిలీ. దీనిపై మా అమ్మానాన్నతో కూర్చొని చర్చించాను. పాత్ర నచ్చిందని, నా మీద నమ్మకం ఉంచమని చెప్పాను. ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్ చేసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఎందుకంటే పబ్లిక్ ఇందూని బాగా లవ్ చేస్తున్నారు. ఈ నెల 15న నా పంజాబీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్టర్ 420’ కూడా రిలీజైంది. అదీ మంచి హిట్టయింది. ఇటు ‘ఆర్‌ఎక్స్ 100’, అటు పంజాబీ సినిమా రెండూ హిట్ కావడంతో నాకు డబుల్ ధమాకా అన్నమాట.