ఒక్క సినిమా సక్సెస్ తోనే భారీ డిమాండ్ !

విజయాలు వస్తే సినిమా, సినిమాకీ పారితోషికం పెంచుకుంటూ వెళ్ళడం సినిమా వాళ్లకి అలవాటే. ‘ఆర్. ఎక్స్-100’ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తీరు ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పటివరకూ ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించిన ఈ చిన్నది ఆ ఒక్క సినిమాతోనే బోలెడంత క్రేజ్ తెచ్చేసుకుంది. ఆ క్రెడిట్ తోనే ప్రస్తుతం పలు చిత్రాల్ని లైన్‌లో పెట్టుకుంది. అయితే ఈ చిన్నది తన అప్ కమింగ్ మూవీస్ కోసం పారితోషికం భారీగానే డిమాండ్ చేస్తోందట.
‘ఆర్.ఎక్స్ -100’ సంచలన విజయం పాయల్ రాజ్ పుత్ కెరీర్‌నే అనుకోని మలుపు తిప్పింది. తొలి సినిమాలో ఎలాంటి ఇమేజ్ లేని ఓ కుర్రోడితో రొమాన్స్ పండించిన ఆమె ఇప్పుడు టాప్ హీరోస్ సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. మాస్ మహారాజా రవితేజతో ‘డిస్కోరాజా’లో చిందేస్తుంటే… మరోవైపు ‘వెంకీ మామ’ వెంకీతో హాట్ రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. అవే కాకుండా బెల్లంకొండ, కాజల్ తాజా చిత్రం ‘సీత’లో ఐటెమ్ సాంగ్‌లోనూ చేసింది. ఇవే కాక మరికొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. తొలి చిత్రానికి కేవలం ఐదారు లక్షలు మాత్రమే అందుకున్న బ్యూటీ.. ఇప్పుడు నటిస్తోన్న చిత్రాలకోసం ముప్పై లక్షలకి పైగా పారితోషికం డిమాండ్ చేస్తూండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఒక వేళ వేరే హీరోయిన్స్‌ను అనుకున్నా వాళ్ళు పాయల్ కన్నా ఎక్కువగానే డిమాండ్ చేస్తారు కాబట్టి …ఫైనల్‌గా పాయల్‌నే ఖాయం చేసుకుంటున్నారట.
కేవలం ఒకే ఒక సినిమాలో నటించిన పాయల్ రాజ్ పుత్ ఇంకా రెండో సినిమా విడుదల కాకుండానే ఇన్ని రెట్లు పారితోషికం డిమాండ్ చేస్తూండడం దర్శక, నిర్మాతలకు అంతు పట్టడం లేదు. అయితే ఆమె క్రేజ్ టాప్ హీరోల రేంజ్‌కు పెరగడంతో ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడం తప్ప నిర్మాతలకు వేరే మార్గం కనిపించడంలేదట.
పవర్‌ఫుల్‌ లేడీ ఓరియంటెడ్‌ ‘ఆర్‌డీఎక్స్‌’
‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్, ‘ఆవకాయ బిర్యానీ, హుషారు’ ఫేమ్‌ తేజస్‌ జంటగా శంకర్‌ భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌’. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం సమర్పణలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ‘పవర్‌ఫుల్‌ లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌.
 
‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత మరో పవర్‌ఫుల్‌ పాత్ర చేస్తున్నా. ఇది లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌. ఇలాంటి పాత్ర చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని చెప్పింది పాయల్‌ రాజ్‌పుత్‌