టాప్‌ హీరోలతో టాప్‌ లీగ్‌లోకి ఎంట్రీ !

పాయల్‌ రాజ్‌పుత్‌… ‘ఆర్‌ఎక్స్‌ 100’లో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేసి ప్రేక్షకుల చేత భేష్‌ అనిపించుకుందీ పంజాబీ బ్యూటీ .‘ఆర్‌ఎక్స్‌ 100’ సూపర్‌ సక్సెస్‌తో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది . మొదటి సినిమాలోనే బోల్డ్‌గా నటించి ఇండస్ట్రీ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందామె. ఆసినిమా తర్వాత వరుసగా సినిమాలు సైన్‌ చేస్తుందనుకుంటే కొంచెం సమయం తీసుకుంది. ప్రస్తుతం  సినిమాలకు వరుస సంతకాలు చేస్తోంది. మొదట రవితేజ సరసన ‘డిస్కో రాజా’ లో ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌గా ఎంపికయింది. లేటెస్ట్‌గా నాగార్జునతో ‘మన్మథుడు 2’లో , వెంకటేశ్‌ కాంబినేషన్ లో ‘వెంకీ మామ’లో హీరోయిన్‌గా కమిట్‌ అయిందీ బోల్డ్‌ బ్యూటీ. ఇలా టాప్‌ హీరోలు ముగ్గురితో సినిమాలు సంతకం చేసి ఒకేసారి బిజీ అయిపోయింది. ఈ సినిమాలు సక్సెస్‌ అయితే పాయల్‌ టాప్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనుకోవచ్చు. ప్రస్తుతం ఆమె తమిళంలో ఉదయ్‌ నిధి స్టాలిన్‌తో ‘ఏంజిల్‌’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తోంది.
మూగ, చెవిటి యువతిగా…
పాయల్‌ రాజ్‌పుత్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’లోనెగటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేయడమే కాకుండా ప్రేక్షకుల చేత భేష్‌ అనిపించుకుందీ పంజాబీ బ్యూటీ . ఇప్పుడు రెండో సినిమాకి ఇంకా పెద్ద సవాల్‌ని స్వీకరించింది. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్ళూరి నిర్మాతగా ‘డిస్కో రాజా’(వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించనున్నారు. 1980 నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో హీరో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తారని సమాచారం.
 
అలాగే పాయల్‌ రాజ్‌పుత్‌ అంధురాలిగా, బధిర (మూగ, చెవిటి) యువతిగా నటించనుంది. అంటే.. ఈ సినిమాలో క్యారెక్టర్‌ పరంగా పాయల్‌కు వినిపించదు. కనిపించదన్నమాట. ఈ పాత్రలో పర్ఫెక్ట్‌గా ఒదిగిపోవడానికి బ్లైండ్‌ స్కూల్‌కి వెళ్లి అక్కడ ఉన్న స్టూడెంట్స్‌ హావభావాలను పరిశీలించాలని డిసైడ్‌ అయ్యింది పాయల్‌.