శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో కోటి తూముల నిర్మిస్తోన్న చిత్రం `అరుంధతి-2`. చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథాంశంతో భారీ బడ్జెట్ తో , భారీ గ్రాఫికల్ చిత్రంగా ప్రముఖ నిర్మాణ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సందర్బంగా చిత్రం గురించి నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ…“ చారిత్రాత్మక ,యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన ప్రముఖ తారలు నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువైలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కథాంశంలో భాగంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ , గుర్రపుస్వారీ, కత్తి సాములకు సంబంధించిన శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద తీసుకుంటోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం“ అన్నారు