‘అర్జున్‌రెడ్డి’ సినిమా రిలీజై చాలా రోజులవుతున్నా, ఇంత వరకు సందీప్ నుండి మరో చిత్రం గురించి ఎటువంటి సమాచారం రాలేదు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండకి ఎంత పేరు వచ్చిందో, ఆ సినిమాకి దర్శకుడైన సందీప్ వంగాకి కూడా అంతే పేరు వచ్చింది. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నుండి సందీప్ వంగాకి ఫోన్ వెళ్లినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల సారాంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కోసం సందీప్ వంగా మంచి స్టోరీని రెడీ చేశాడంట. అన్నీ కుదిరితే పవన్ కళ్యాణ్‌ని సందీప్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తాజాగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్‌కి కూడా సందీప్ డైరెక్ట్ చేసిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం బాగా నచ్చి, ఫోన్ చేసి మరీ అభినందించినట్లుగా మొదలైన ఈ వార్తలు, మంచి స్టోరీ ఉంటే చేద్దామని పవన్ అనడం, వెంటనే ఓ లైన్‌ని పవన్‌కి వినిపించడం, పవన్‌కి నచ్చి డెవలప్ చేయమని చెప్పడం వంటివి వెంటవెంటనే జరిగిపోయాయనే వార్తలు వస్తున్నాయి.అయితే, రీసెంట్గా మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మాతలు ఓ మూవీ కోసం సందీప్‌కి అడ్వాన్స్‌గా 50 లక్షలు ఇచ్చారని తెలిసింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌కి పవన్ ఓ సినిమా చేయడానికి అప్పుడెప్పుడో కమిట్ అయ్యాడు. అందువల్ల నిజంగానే తెరవెనుక ఇటువంటి ప్రయత్నమేదైనా జరుగుతుందో తెలియదు కానీ, పవన్‌తో సందీప్ సినిమా అంటే టాలీవుడ్ లో సంచలనం ఖాయం!