పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మూవీలో నటించడానికి 40 రోజులు కాల్షీట్లు కేటాయించాడట. పొలిటికల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటూనే, ఫిబ్రవరిలో కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నాడు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ‘అజ్ఞాతవాసి’ అభిమానుల తీవ్రనిరాశకు గురి చేసింది.2019 సాధారణ ఎన్నికలకు ఏడాదే గడువు ఉండడంతో, పవర్ స్టార్ తర్వాతి సినిమాపై రకరకాల వార్తలు వచ్చాయి….
పవన్ తన రాజకీయ భవిష్యత్‌కు ఉపయోగపడేలా, పొలిటికల్ పంచ్‌లతో సినిమాల్లో నటిస్తాడనే టాక్ వచ్చింది. పవర్ స్టార్ నుంచి బోయపాటి శ్రీనుకు కబురు వెళ్లిందని సినీజనాలూ చెప్పుకున్నారు. అలాగే ‘మాయా మాల్’ ఫేమ్ గోవింద్ లాలం దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంతో ‘చరిత్ర’ అనే సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ పవన్ ఈ రెండు ప్రాజెక్ట్స్‌ని పక్కనపెట్టి, ‘కందిరీగ’ తర్వాత సరైన హిట్ లేని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్కి రెడీ అయిపోయాడు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘చలొరే చలొరే చల్’ అంటూ రాజకీయ యాత్ర ప్రారంభించాడు. ఈ పొలిటికల్ టూర్లో బిజీగా ఉన్నా, నెక్ట్స్ సినిమాకు డేట్స్ ఇచ్చాడట పవన్. మైత్రీ మూవీ మేకర్స్‌లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి 40 రోజులు కాల్షీట్లు కేటాయించాడట. దీంతో ఫిబ్రవరిలో సినిమా స్టార్ట్ చేసి ఆ 40 రోజుల్లో పవన్ పోర్షన్ పూర్తి చేయాలని షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నాడట దర్శకుడు. మిగతా నటీనటుల సన్నివేశాలు మిగతా షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాడట. ఈ సినిమాలో పొలిటికల్ పంచ్‌లు ఉండవని, కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా పవన్-సంతోష్ సినిమా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు.