పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేయాలంటూ తమ్ముడిని ఎంకరేజ్ చేసారట చిరంజీవి. అందుకే అన్న మాట కాదనకుండా అరడజన్ సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నాడు పవన్. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే పండగ చేసుకుంటారు అభిమానులు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఏడాదికి మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అంతా చిరంజీవి పుణ్యమే. పవన్ కెరీర్ మొత్తంలో ఎప్పుడూ లేనంత బిజీగా ఇప్పుడున్నాడు. ముఖ్యంగా ఈయన గత సినిమా ‘అజ్ఞాతవాసి’ 2018 సంక్రాంతికి విడుదలైంది. అంటే ఇప్పటికే మూడేళ్లైపోయిందన్నమాట. ఆ తర్వాత 2019 ఎన్నికలతో బిజీ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ ఊపందుకుంటుంది.
‘వకీల్ సాబ్’ సినిమా ఇప్పటికే పూర్తయ్యి ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ సినిమా వచ్చిన నాలుగు నెలలకు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ విడుదల కానుంది. ఈ సినిమా కోసం రెండు నెలలు డేట్స్ ఇచ్చాడు పవర్ స్టార్. సాగర్ కే చంద్ర సినిమాను అంత వేగంగా పూర్తి చేయనున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఆగస్ట్ లో ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇవి కాకుండా క్రిష్ సినిమా కూడా లైన్ లోనే ఉంది. మరోవైపు ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లకు పైగానే ఉందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. అంటే.. సమ్మర్లో “వకీల్ సాబ్’.. 2021 ఆగస్ట్ లో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్.. 2022 సమ్మర్ కు క్రిష్ సినిమా విడుదల కానున్నాయి. 12 నెలల్లో 3 సినిమాలు విడుదల చేసి పవన్ తన కెరీర్ లోనే కొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. వీటితోపాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు కూడా లైన్ లోనే ఉన్నాయి.
పేపర్స్ ఎగరేసే రేంజ్ లో… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలున్న ఈ చిత్రం బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తీస్తున్న సంగతి తెలిసిందే. మన నేటివిటీకి చాలానే మార్పులు చేసి కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు. అయితే మరి దర్శకుడు శ్రీరామ్ వేణు మాత్రం పర్టికులర్ గా ఓ సీన్ ను హైలైట్ చేసి చెప్తున్నారు. పవన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ సీన్ థియేటర్స్ లో ‘పేపర్స్ ఎగరేసే రేంజ్ లో ఉంటుంది’ అని చాలా ఎగ్జైటింగ్ గా చెప్తున్నారు. మరి ఆ సీన్ ఏంటో తెలియాలి అంటే వచ్చే ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటించారు.