వెండితెరపై కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరించబోతూ ఫ్యాన్స్‌కు పండగ చేయనున్నాడు పవన్. బుల్లి తెర పై ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడట పవర్ స్టార్.ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా.. స్మాల్ స్క్రీన్‌పై ఫోకస్ పెట్టారు. చిరంజీవి, నాగార్జున, జూ.ఎన్టీఆర్, నాని తర్వాత తెలుగులో మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ బుల్లితెరపై వ్యాఖ్యాతగా చేయబోతున్నాడు.బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నిర్వహించిన సామాజిక కార్యక్రమం ‘సత్యమేవ జయతే’ తరహాలో పవన్ కళ్యాణ్ బుల్లితెర కార్యక్రమం ఉండబోతుందట.
స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి, ప్రస్తుతం వెండితెరకు కాస్త దూరంగా ఉన్నాడు. తన పొలిటికల్ అజెండాతో.. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పర్యటిస్తున్న పవన్.. ప్రజలతో పలు సామాజిక అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. అయితే ఈ సారి ఇవే సామాజిక అంశాలకోసం బుల్లితెరను వేదికగా చేసుకోబోతున్నాడట. స్మాల్ స్క్రీన్‌పై ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడట పవర్ స్టార్.ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రపోజల్‌ను ఓ.కె. చేశాడట పవన్. సెప్టెంబర్ నుంచి ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చబోతున్నట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఛానెల్లో.. ‘పవర్ స్టార్’ ప్రోగ్రామ్ ప్రసారం కానుందట.