‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తాజా చిత్రాన్ని నిర్మిస్తున్న హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అభిమానులకు గిఫ్ట్ ఇచ్చింది. చాలా రోజులుగా పవన్ ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం ఓ మ్యూజికల్ సర్ప్రైజ్ ను రిలీజ్ చేసింది. పవన్ ఫేస్ రివీల్ చేయకపోయినా.. కొద్ది క్షణాల పాటు పవన్ ను నీడలా చూపించారు. అంతేకాదు సినిమాలోని ఓ పాటను అనిరుధ్ హమ్ చేస్తుండగా పక్కనే దర్శకుడు త్రివిక్రమ్ ఆ పాటను ఎంజాయ్ చేయటాన్ని కూడా ఈ వీడియోలో చూపించారు.
‘బయటికొచ్చి చూస్తే టైమెమో త్రీఒక్లాక్’ అంటూ సాగే ఈ పాట ఫుల్ ట్రెండీగా ఉంది. త్రివిక్రమ్ మార్క్ విజువల్స్ తోడైతే మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకం అభిమానుల్లో కలిగించేలా ఈ సాంగ్ రూపొందింది. అంతేకాదు ఈ టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ను కూడా కన్ఫామ్ చేశారు. అయితే సినిమా టైటిల్ మాత్రం ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. కొద్ది రోజులుగా పవన్ షూటింగ్ కు సరిగా సహకరించటం లేదని, సినిమా జనవరిలో రావటం కూడా డౌటే అన్న అనుమానాలను దూరం చేస్తున్న జనవరి 10, 2018న సినిమా రిలీజ్ అంటూ కన్ఫామ్ చేశారు.