‘పాన్ ఇండియా స్టార్’గా మారిన ప్రభాస్ ఇప్పటికే వరుసగా నాలుగు చిత్రాలను అనౌన్స్ చేసి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్ద్ ఆనంద్‌తో కలిసి మరో పాన్ ఇండియా చిత్రం చేసేందుకు సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ వంటి హై బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించిన ఈ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ చర్చలు సఫలం అయితే డిసెంబర్ 2022లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. 2023 మూవీ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సిద్ధార్ద్ .. షారూఖ్ ఖాన్, దీపిక పదుకొణే, జాన్ అబ్రహం కాంబినేషన్లో ‘పఠాన్’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. దీని తర్వాత హృతిక్, దీపికా కాంబినేషన్లో ‘ఫైటర్’ అనే వార్ డ్రామా చేయనున్నాడు. ఇవి పూర్తయ్యాక ప్రభాస్‌తో సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.
‘ఆదిపురుష్’ డేట్స్ ‘సాలార్’ కి… ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ‘సాలార్’ చిత్రంతోపాటు ‘ఆదిపురుష్’ సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. దీంతోపాటు నాగ్అశ్విన్ తో కూడా మరో సినిమా చేస్తున్నాడు. గోదావరి ఖని బొగ్గు గని ప్రాంతంలో ‘సాలార్’ తొలి షెడ్యుల్ షూటింగ్ జరుపుకుంది. మరోవైపు ‘ఆదిపురుష్’ చిత్రం షూటింగ్ ముంబైలో మొదలైంది.కానీ ఆ చిత్రం కోసం వేసిన భారీ సెట్ లో అగ్ని ప్రమాదం జరగడం వాళ్ళ షూటింగ్ ఆగిపోయింది. ప్రభాస్ వెంట వెంటనే ‘సాలార్’, ‘ఆదిపురుష్’ షూటింగ్స్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నాడట. నెలలో 15 రోజులు ‘సాలార్’ కోసం, మరో 15 నెలలు ‘ఆదిపురుష్’ కోసం కేటాయించినట్టు ఫిలింనగర్ వర్గాల టాక్. ‘సాలార్’ మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే ప్రభాస్ ముంబైకు పయనమై ‘ఆదిపురుష్’ షూటింగ్ లో పాల్గొనున్నాడట. అయితే, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ‘ఆదిపురుష్’ కోసం కేటాయించిన డేట్స్ ‘సాలార్’ కి కేటాయించే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడని తెలుస్తోంది.
సైన్స్ ఫిక్షన్ డ్రామా !… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొనే హీరోయిన్గా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. సంక్రాంతి పండగ రోజు స్పెషల్ అప్డేట్ ఉంటుందని భరోసా ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ తీరా సమయానికి చేతులెత్తేశాడు… ‘జనవరి 29న లేదా ఫిబ్రవరి 26న మరొక అప్డేట్ రాబోతుంది’ అని ఫ్యాన్స్‌ను శాంతింపజేశాడు. దీంతో అభిమానులు ఆ రోజు ఎప్పుడు వస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో నాగ్ అశ్విన్ మరో చేదు వార్త చెప్పి ప్రభాస్ అభిమానులను నిరాశపర్చాడు. 26 తారీఖున ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని చెప్తూ ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు.
కాగా ఈ చిత్రం మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ జూలై 30న విడుదలవుతోంది., ఆదిపురుష్ ఆగస్టు 11న రిలీజవుతుందని చెప్పారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్న ‘సాలార్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తర్వాత ‘ఆదిపురుష్’, ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు.