రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “పాగల్ వర్సెస్ కాదల్” సినిమా ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. విజయ్ శంకర్, విషిక హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని శివత్రి ఫిలింస్ బ్యానర్ పై పడ్డాన మన్మథరావు నిర్మిస్తున్నారు. రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ – మా పాగల్ వర్సెస్ కాదల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నేను కార్తీక్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. కార్తీక్ ఇన్నోసెంట్ అబ్బాయి. తన ప్రేయసి ప్రియతో ఇబ్బందులు పడుతుంటాడు. పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ప్రియ పాత్రలో విషిక అద్భుతంగా నటించింది. ఈ నెల 9న థియేటర్స్ లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ విషిక మాట్లాడుతూ – పాగల్ వర్సెస్ కాదల్ సినిమాలో నేను ప్రియ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్ ను తన అనుమానంతో ఇబ్బందులు పెడుతుంటుంది. నా క్యారెక్టర్ చూసి “మేము మా బాయ్ ప్రెండ్స్ ను ఇంత ఇబ్బంది పెట్టం” అని అమ్మాయిలు అనుకుంటారు. నేను నటించిన కమిటీ కుర్రాళ్లు సినిమాతో పాటు పాగల్ వర్సెస్ కాదల్ కుడా ఒకే డేట్ కు ఈ నెల 9న రిలీజ్ అవుతున్నాయి. నా కెరీర్ లో మర్చిపోలేని సందర్భం ఇది. మా పాగల్ వర్సెస్ కాదల్ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అని చెప్పారు.
ఎడిటింగ్, డీఐ – శ్యామ్ కుమార్.పి., సినిమాటోగ్రఫీ – నవధీర్
మ్యూజిక్ – ప్రవీణ్ సంగడాల, బ్యానర్ – శివత్రి ఫిలింస్
నిర్మాత – పడ్డాన మన్మథరావు, రచన, దర్శకత్వం – రాజేశ్ ముదునూరి