తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఈ రోజు ఫిల్మ్ నగర్లో ఎన్టీఆర్ కృష్ణావతార కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నందమూరి జయకృష్ణ, గారపాటి లోకేశ్వరి గణేశ్వరావు ,నందమూరి మాధవి మణి సాయికృష్ణ ,
శ్రీమతి లక్ష్మి హరికృష్ణ ,నందమూరి మోహన కృష్ణ గారు (విగ్రహ దాత), దగ్గుబాటి వెంకటేశ్వరరావు,
శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, శ్రీమతి నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు,నందమూరి రామకృష్ణ,
శ్రీమతి&శ్రీ కంటమనేని ఉమ మహేశ్వరి శ్రీనివాస ప్రసాద్, నందమూరి జయశంకర్ కృష్ణ,
శ్రీమతి పరిటాల సునీత, జి.ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, సి కల్యాణ్, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానం నాగేందర్ సభాధ్యక్షతన జరిగిన సభలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాద్ విగ్రహావిష్కరణ చేసారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మనతోనే ఉన్నారు, ఉంటారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాల పేరె త్రిమూర్తుల స్వరూపం. శివుడిలా పేదవారి ఉన్నతికి ఎన్నో పధకాలను సృష్టించారు. ఇక ఆయనే ఒక విష్ణుమూర్తి స్వరూపం. వారి మనస్తత్వం పై నేనో పుస్తకాన్ని రచించనున్నాను. వారితో నేను చేసిన 16 ఏళ్ల ప్రయాణం, చెప్పిన జీవిత సత్యాలతో పుస్తకముంటుంది. మమ్మల్ని రచయితలుగా ఎన్టీఆర్ పోత్సహించారు. పరుచూరి బ్రదర్స్ అని మాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. అని అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. మాగంటి గోపినాధ్, పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ కు సన్నిహితులు. ఎన్టీఆర్ గారిని కలిసే అదృష్టం నాకు కొన్నిసార్లు లభించింది. ఫిలింనగర్ లో రోడ్డుకే కాదు ఫిలిం నగర్ కే ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు
మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ .. “ఎన్టీఆర్ గారు తెలుగు జాతి గర్వపడేలా చేసిన వ్యక్తి. నాయకుడిగా నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఎన్టీఆర్ వల్లే ఎంతోమంది నాయకులుగా ఎదిగారు. వారి విగ్రహాన్ని ఆవిష్కరిచటం తో నా జన్మ ధన్యమయింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నారు. ఫిలిం నగర్ లోఎన్టీఆర్ మార్గ్ పేరు వచ్చేలా, సీఎం కేసీఆర్ తో మాట్లాడి కృషి చేస్తాను. హైదరాబాదు లో అభివృద్ధి కి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ గారే” అని అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారి వల్లే ఫిలిం నగర్ డెవలప్ అయింది.లోకల్ టాలెంట్ ను ఎన్టీఆర్ ఎంకరేజ్ చేశారు. పాన్ ఇండియా సినిమాలకు మూలకర్త ఎన్టీఆర్. నటుడిగా, నాయకుడు గా ఎన్టీఆర్ మార్క్ చూపించారు. ఏ రాష్ట్రంలో చూసినా ఎన్టీఆర్ పధకాలే. గజం స్దలం కూడా ఉచితంగా తీసుకోకుండా సినీ పరిశ్రమకి కృషి చేశారు.వారి శత జయంతి నాడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం అభినందనీయం” అని అన్నారు.
సి కల్యాణ్ మాట్లాడుతూ… నందమూరి మోహనకృష్ణ ,ప్రసన్న కుమార్ గారి వల్లే ఫిలింనగర్ లో విగ్రహం ఏర్పాటయింది. ఫిలిం నగర్ లో ఎన్టీఆర్ మార్గ్ పేరు కావాలన్నది మా కోరిక. మాగంటి గోపినాద్ ఎన్టీఆర్ కు ప్రియ శిష్యుడు. కేసిఆర్ గారికి కూడా ఎన్టీఆర్ అంటే అభిమానం. వారు తలుచుకుంటే ఎన్టీఆర్ మార్గ్ రావటం తధ్యం. గోపీనాధ్ గారు కేసిఆర్ గారి దృష్టి కి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని కోరుతున్నాము అని అన్నారు.