‘బాహుబలి’ సినిమాకోసం ప్రభాస్, రానా, అనుష్క తమ శరీరం బరువును తగ్గించుకోవడం, పెంచుకోవడం చేయాల్సి వచ్చింది. ఇక అనుష్క అయితే సైజ్ జీరోలో తన పాత్రకు తగ్గట్టు శరీరాన్ని మలచుకోడానికి చాలా కష్టపడింది.సినిమా పాత్ర కోసం శరీరాకృతి విషయంలో చాలా మార్పులు, చేర్పులు చేసుకోవడం ఈ మధ్య కామన్గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా తను నటించబోయే రోల్ కోసం శరీరాన్ని మౌల్డ్ చేసుకుంటున్నాడట. జూనియర్ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమా చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది.దీని తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఓ చిత్రం చేస్తున్నాడు.
త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని తెలుస్తుండగా, ఇందులో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ డిఫరెంట్ గా చూపించాలని భావిస్తున్నాడట. అందుకోసం బరువు తగ్గాలనీ …. మరింత ఫిట్ గా కనిపించాలని సూచించాడట. దాంతో డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిపుణుల పర్యవేక్షణలో జిమ్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడట ఎన్టీఆర్ . థాయ్ ,ఇండోనేషియా స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ను తెరపై చూపించాలని త్రివిక్రమ్ భావిస్తుండగా, ఈ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడానికి ఎన్టీఆర్ ఆగ్నేయ ఆసియా వెళ్లనున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ సినిమాతో బిజీగా ఉండగా, ఈ మూవీ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడట.