యంగ్‌టైగర్ ఎన్టీఆర్, నివేదా థామస్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్‌పై రూపొందుతోన్న చిత్రం `జై లవకుశ`. కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకుడు. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మాత. ఈ సినిమా యూనిట్ పాత్రికేయుల సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బిగ్ సీడీని నందమూరి హరికృష్ణ విడుదల చేయగా, ఆడియో సీడీలను ఎన్టీఆర్ విడుదల చేసి తొలి సీడీని హరికృష్ణకు అందించారు. ఈ కార్యక్రమంలో…
ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ – “సినిమాలో కుశ క్యారెక్టర్ నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంటాడు. నేను జై, కుశ క్యారెక్టర్స్‌తో లవ్‌లో పడిపోయాను. బాబి, ఎన్టీఆర్, సహా యూనిట్ అంతా మంచి అవుట్‌పుట్‌ను రాబట్టాం. ఎన్టీఆర్ చేసిన నత్తి క్యారెక్టర్‌ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనిపించింది. కానీ ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ చేసిన మూడు క్యారెక్టర్స్ చూసి స్పెల్ బౌండ్ అయ్యాను. ఈ సినిమా గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్“ అన్నారు.
కోనవెంకట్ మాట్లాడుతూ – “మూడు క్యారెక్టర్స్ కలిపితేనే జై లవకుశ. ఈ ముగ్గురుని కలిపితేనే సినిమా. ప్రతివారిలో ఓ స్పెషాలిటీ, గ్రేట్ క్వాలిటీ ఉంటుంది. తారక్‌ను తప్ప, మరేవరినీ ఈ సినిమాలో ఊహించుకోలేం“ అన్నారు.
రాశిఖన్నా మాట్లాడుతూ – “మూడు పాత్రల్లో చేయడం అంటే అంత సులువు కాదు. తన నటనను సెట్స్‌లో చూసి వావ్ అనుకున్నాం. సెట్స్‌లో చాలా సందర్భాల్లో క్లాప్స్ కొట్టాం. తారక్ బ్రిలియట్ పెర్ఫార్మర్. తన గురించి చెప్పడానికి మాటలు లేవు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు నిర్మాత కల్యాణ్‌రామ్‌గారికి థాంక్స్“ అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – “జై, లవ, కుశ అనే క్యారెక్టర్స్ ఎలాగో తారక్‌తో ఇది నాకు వరుసగా మూడో సినిమా. తారక్ నాకు బ్రదర్ లాంటివాడు. ఓ హీరోకు నా కెరీర్లో వరుసగా మూడు సినిమాలకు మ్యూజిక్ అందించడం ఇదే ప్రథమం. సినిమాను చూసేశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. బాబి వండర్ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ చెప్పిన రోజున ఏ ఎగ్జయిట్మెంట్ ఉందో, దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచేలా సినిమా తీశారు. ప్రతి సన్నివేశం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ కావడంతో, సాంగ్స్ కూడా డిఫరెంట్‌గా కంపోజింగ్ చేయడానికి అవకాశం కలిగింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను. దాదాపు పూర్తయ్యింది. మ్యూజిక్ ఆల్బమ్‌ను బ్లాక్‌బస్టర్ చేసినందుకు నందమూరి అభిమానులకు థాంక్స్. ఇప్పుడు జ్యూక్ బాక్స్‌లో విన్న సాంగ్స్ కాకుండా మరో సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మంచి డ్యాన్సింగ్ సాంగ్. ఎలక్ట్రానిక్ ఫోక్లో డిఫరెంట్‌గా సాగే పాట“ అన్నారు.
నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ – “జై లవకుశ పేరు చూడగానే ఆనాడు మా తండ్రిగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు నటించిన ఆనాటి ‘లవకుశ’ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే చరిత్ర సృష్టించిన సినిమా అది. రాముడంటే ఇలా ఉంటాడని ప్రజలకు ఎలుగెత్తి చెప్పిన సినిమా. అలాగే ఈ సినిమా కూడా ప్రజల మన్నలు పొందాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సూపర్‌హిట్ కావాలి. మా నాన్నగారు పై నుండి దీవిస్తున్నారు. ఆయన మాకు ఇచ్చిన గొప్ప ఆస్థి అభిమానం. అభిమానుల కారణంగానే నందమూరి వంశం ఇలా ముందుకు వెళుతుంది. ఇంకా ముందుకు వెళ్లాలి. జై లవకుశ కుటుంబ కథా చిత్రం. ఇక్కడ చిత్రం ఏంటంటే తమ్ముడు హీరో అయితే, అన్న నిర్మాత. ఇది చూస్తుంటే అలనాడు మా రామకృష్ణా స్టూడియోస్ గుర్తుకొస్తుంది. నేను ప్రొడ్యూసర్ అయితే బాలయ్య ఆర్టిస్ట్. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా ఎన్టీఆర్ యాక్ట్ చేస్తే, కల్యాణ్ బాబు నిర్మించారు. డైరెక్టర్ బాబిగారికి అభినందనలు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు అందించాలి. దేవిశ్రీప్రసాద్ నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ తర్వాత సంగీతం అందించిన సినిమా ఇది. కోనవెంకట్, ఛోటా కె.నాయుడు, బ్రహ్మాజీ, రాశిఖన్నా సహా అందరినీ అభిమానులు ఆశీర్వదించాలి“ అన్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – “మా నందమూరి కుటుంబంలో ఓ ప్రొడక్షన్ హౌస్. అందులో ఓ నందమూరి హీరో యాక్ట్ చేసి చాలా సంత్సరాలైంది. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సిచ్చువేషనల్ సాంగ్స్. అన్ని సన్నివేశాలకు తగినట్లు డిఫరెంట్‌గా ఉంది. తారక్ గురించి సెప్టెంబర్ 10న మాట్లాడుతాను. సన్ని, మా హరికి థాంక్స్. బాబికి చాలా కష్టపడ్డాడు. యూనిట్ సభ్యులందరూ చాలా కష్టపడ్డారు. సినిమాను సెప్టెంబర్ 21న విడుదల చేస్తున్నాం“ అన్నారు.
కె.ఎస్.రవీంద్ర మాట్లాడుతూ – “కల్యాణ్‌రామ్‌గారు నేను అసిస్టెంట్ రైటర్‌గా ఉన్నప్పటి నుండి మంచి పరిచయం ఉంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత శ్రీహరి, నందమూరి కల్యాణ్‌రామ్‌లతో చాలా మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో తారక్ గారి సినిమాను నేను డైరెక్ట్ చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. తారక్ గారి గురించి చాలా దాచుకున్నాను. ఎన్టీఆర్‌గారితో మూడు వేరియేషన్స్ ఉన్న సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం నాకు వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎన్టీఆర్‌గారి పెర్ఫార్మెన్స్కు నేను సాక్షిని. ప్రతిరోజూ నేను ఎంజాయ్ చేశాను. మూడు లేయర్స్‌ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మంచి టీం దొరికింది. గ్యాప్ లేకుండా సినిమాను పూర్తి చేశాం. దేవిశ్రీ, కథ వింటున్నప్పుడే అసుర అసుర..రావణాసుర అనే ట్యూన్ ఇచ్చారు. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. రాశి, నివేదిత, రామజోగయ్యశాస్త్రి, చంద్రబోస్ సహా అందరికీ థాంక్స్“ అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ – “జై లవకుశ’ నాకు కేవలం సినిమాయే కాదు. ఎందుకంటే ఇలాంటి అవకాశాన్ని ఓ నటుడుకి భగవంతుడు, అరుదుగా ఇస్తుంటాడు. ‘జనతాగ్యారేజ్’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు, చిన్నపాటి కన్ఫ్యూజన్కు గురైయ్యాను. మనసుకు నచ్చిన కథతో సినిమా చేయాలా, ట్రెండ్ ఫాలో కావాలా అని ఆలోచన ఉండేది. అయితే బాబిగారు కథ చెప్పగానే, మనసుకు నచ్చిన కథతోనే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను. నా మనసుకు నచ్చిన కథ జైలవకుశ. ఇది కేవలం చిత్రంగానే కాదు, నేను, అన్నయ్య కల్యాణ్ తో పాటు మా పెద్దన్నయ్య కీర్తిశేషులు జానకిరాంగారు ఉండుంటే ‘జై లవకుశ’ అనే టైటిల్‌కు సరిపోయేది. ఈ సినిమాను మా నాన్నగారికి కానుకగా ఇవ్వాలని ఎంతో ప్రయత్నించాం. కానీ కుదరలేదు. సెప్టెంబర్ 2 అయితే ఏంటి..సెప్టెంబర్ 21 అయితే ఏంటి… మా నాన్నకు కానుకగా ఇవ్వాలని చేసిన సినిమా ఇది. ‘అన్నదమ్ములు కలిసి చేసిన ఈ సినిమాతో మా అమ్మలకు మేం సాధించిన విజయమిది’ అని ఈ చిత్రంతో చెప్పాలని ఉంది. తప్పకుండా ‘అమ్మ, నాన్నలను గర్వంగా ఫీలయ్యేలా చేసే సినిమా ఇది’ అని నాకు గట్టి నమ్మకంగా ఉంది. సెప్టెంబర్ 21 కోసం వెయిట్ చేస్తున్నాను. మా తరువాత జనరేషన్‌కు, ఇలా మేం ఇద్దరం కలిసి ఓ సినిమా చేశాం. ఈ సినిమా అలా మిగిలిపోతుందని చెప్పే సినిమా ఇది. ఈసినిమా ముఖ్య ఉద్దేశమే అది. మనం ఏదో చేయాలి, నాన్నకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న తరుణంలో పుట్టిన కథే ఇది. అన్నదమ్ముల ఔనత్యాన్ని పెంపొందించే చిత్రం దొరకడం అదృష్టంగా ఉంది. నా కెరీర్లో సంతృప్తికరమైన చిత్రమిది. బాబీకి థాంక్స్. కోనవెంకట్, చక్రిలకు థాంక్స్. మా ఛోటాన్న కారణంగానే సినిమా ఇంత బాగా వచ్చింది. రాశి, నివేదా స్థానంలో మరో హీరోయిన్స్‌ను ఊహించుకోలేం. వారికి థాంక్స్. దేవిశ్రీప్రసాద్, నేను అనుబంధం హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అని కాకుండా, ఆత్మల మద్య అనుబంధంగా ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం మా మధ్య మొదలైన పరిచయం రోజున ఉన్న ఎగ్జయిట్మెంట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నాకు బ్రదర్, స్నేహితుడు, నా మంచిని కోరుకునే వ్యక్తి. నాకు తనపై ఉన్న నమ్మకం, తనకు నాపై ఉన్న ప్రేమకు ఇది తార్కాణం. మా మధ్య అనుబంధానికి మాటలు అవసరం లేదు. పాటలే నిదర్శనం. పాటలు వింటే మూడు క్యారెక్టర్స్ ఓ మెసేజ్‌ను ఇస్తుంటాయి. రామజోగయ్యశాస్త్రి, చంద్రబోస్‌గారు అద్భుతమైన పాటలను రాశారు. అలాగే సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నిషియన్‌కు థాంక్స్. సక్సెస్, ఫెయిల్యూర్‌ను పక్కన పెట్టేస్తే, నేను, అన్నయ్య గర్వంగా నాన్న ముందు నిలబడే అవకాశం ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నాను“ అన్నారు.