వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం ‘జై లవ కుశ’ . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U / A సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఖరారు చేసింది.
ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా భారీ స్థాయి లో “జై లవ కుశ” చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. కేవలం 38 గంటల లో కోటి కి పైగా వ్యూస్ ను “జై లవ కుశ” ట్రైలర్ సంపాదించుకుంది.
“యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో పాటు, అన్నదమ్ముల మధ్య నడిచే ఒక బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నాం” అని నిర్మాత కళ్యాణ్ రామ్ అన్నారు.
కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్)
Jai Lava Kusa gets U/A
Young Tiger NTR who is on a roll with back to back hits, has teamed up for the prestigious project “Jai Lava Kusa” with his brother Nandamuri Kalyan Ram. The movie, which is being produced on NTR Arts banner, is being directed by K.S. Ravindra (Bobby).
The film has completed its censor formalities today and it has received a U/A certificate from the board. The movie is now all set for a grand worldwide release on September 21st. “Jai Lava Kusa” is generating tremendous buzz among film lovers and the recently released Theatrical Trailer has racked up 1 Crore views in just 38 hours.
Producer Nandamuri Kalyan Ram said “Jai Lava Kusa has completed its censor formalities. The movie is going to release on September 21st in a big way. NTR’s triple role and a strong storyline revolving around three brothers will prove to be the biggest assets for the movie. We have produced Jai Lava Kusa on a lavish scale with top notch production values and technical standards”.
Raashi Khanna and Nivetha Thomas are the heroines in the movie.Devi Sri Prasad is the music director while Chota K Naidu is the cinematographer. Editing is by Kotagiri Venkateswara Rao and Thammi Raju. Art : A.S. Prakash. Visual Effects : Anil Paduri (Advitha Creative Studios)