టాలీవుడ్ సినిమా ఎంత అభివృద్ధి చెందిందో ‘బహుబలి’ని దృష్టిలో పెట్టుకుని చెప్పక్కరలేదు. దానికన్నా ముందే మనవాళ్ళు మరింత ముందుకెళ్ళారు . రాజమౌళిని పక్కన పెట్టి చూస్తే …. పెద్ద హిట్లు ఇచ్చిన కొందరు దర్శకులు 20కోట్లు , కొందరు హీరోలు 30 కోట్లు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు .
ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు తేజ ఆ తర్వాత వరుసగా పరాజయాలను చవిచూశాడు . చాలా ఏళ్ల తరువాత రీసెంట్గా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో అనూహ్యమైన సక్సెస్ను అందుకున్నాడు తేజ. ఈ సినిమాకు పారితోషికంగా లాభాల్లో వాటా తీసుకున్నాడు. మంచి లాభాలురావడంతో ఆయన వాటాగా దాదాపు ఐదు కోట్ల వరకు ముట్టాయని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.
‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కబోయే ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆఫర్ తేజ తలుపుతట్టిందట. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో పొలిటికల్ సీన్లను తేజ బాగా హ్యాండిల్ చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ కోసం తేజను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు తేజ ఐదు కోట్లు అడిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టు విషయంలో దర్శకుడు తేజ, నిర్మాత సాయి కొర్రపాటి మధ్య చర్చలు జరుగుతున్నాయట. నిజానికి తేజకు నిర్మాతల డైరక్టర్ అనే పేరుంది. సినిమాను అనుకున్న బడ్జెట్లో తెరకెక్కించటంలో సిద్ధహస్తుడు తేజ. బడ్జెట్ విషయంలోనే కాదు చక్కటి క్వాలిటీతో వేగంగా తీస్తాడనే పేరు కూడా ఉంది. దీంతో తేజ డిమాండ్ చేసినమొత్తాన్ని ఇవ్వడంలో నష్టంలేదని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ‘నేనే రాజు నేనే మంత్రి’ తో అనుకున్న దానికంటే ఎక్కువ పారితోషికాన్ని,మార్కెట్ లో డిమాండ్ ని దక్కించుకున్న తేజ కోసం మరిన్ని విజయాలు ఎదురుచూస్తున్నాయి…