ఇప్పటివరకూ చేసిన అన్ని సినిమాల్లోనూ హీరో పక్కన జతకట్టిన మలయాళ బ్యూటీ నిత్యామీనన్ ఇప్పుడు ఒక మలయాళ సినిమాలో సోలోగా కనిపించనున్నారు. నిత్యామీనన్ ఆ సినిమా మొత్తంలో ఒక్కరే కనిపిస్తారు. సమాజంలోని సమస్యలపై పోరాడే రచయిత్రిగా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా పేరు ‘ప్రాణ’. వీకే ప్రకాశ్ దర్శకత్వంలో నిత్యామీనన్ లీడ్ రోల్లో తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.ప్రముఖ కెమెరామేన్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. రాజేష్ జయరామన్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి వి. కె. ప్రకాష్ దర్శకుడు .
‘‘ప్రాణ’ సినిమాలో ఓన్లీ వన్ క్యారెక్టర్. సమాజంలోని సమస్యలపై పోరాడే ప్రొగ్రెసివ్ రైటర్ క్యారెక్టర్లో నిత్యామీనన్ నటిస్తున్నారు. సినిమాలో ఆమె ‘మ్యూజిక్ ఆఫ్ ప్రీడమ్’ అనే బుక్ రాస్తుంది. ఈ బుక్కి కీలక పాత్ర ఉంది’’ అని పేర్కొన్నారు పీసీ శ్రీరామ్. అంటే.. ఈ సినిమాకు ‘ఆమే ఒక సైన్యం’ అన్నమాట. ఈ సినిమా కోసం ‘సింక్రనైజ్డ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్’ అనే కొత్త టెక్నాలజీని సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి వాడుతున్నారు. ఏక కాలంలో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ‘‘బెంగళూరులో ఉండటం వల్ల కన్నడతో ప్రాబ్లమ్ లేదు. మలయాళం నా మాతృభాష. తెలుగు సినిమాల్లో నటించాను కాబట్టి, అది కూడా వచ్చు. హిందీ అర్థం అవుతుంది. కానీ ప్లూయెంట్గా మాట్లాడలేను’’ అని చెప్పుకొచ్చారు నిత్యామీనన్.
మన ప్రత్యేకత ఏంటో నిరూపించుకోవాలి !
నిత్యామీనన్ అరుదైన అమ్మాయి. ఆమె అభిప్రాయాలు బోల్డ్‌గా ఉంటాయి. నిత్య.. న్యాయంగా ఉంటారు. అబ్బాయిలందర్నీ పట్టుకుని తిట్టేయరు.. ‘వీళ్లింతే’ అని! అలాగే అమ్మాయిల్నీ కారణం లేకుండా వెనుకేసుకురారు. మలయాళం మూవీ ఇండస్ట్రీలో మగాళ్లదే రాజ్యం అయిపోయిందని ఈమధ్య నిత్య కో–స్టార్ పార్వతి అన్నప్పుడు.. మీడియా అంతా నిత్య చుట్టూ చేరింది. ‘నిజమేనా?’ అని! సినిమా పరిశ్రమలో ఆడవాళ్లకు ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ ఉండడం లేదన్నది కూడా పార్వతి చేసిన ఒక కామెంట్. ‘ఆ.. నిజమే’ అన్నారు నిత్య. అలాగని ఆమె మగవాళ్లనేం తప్పు పట్టలేదు.
‘‘ఎక్కడ మాత్రం లేదు చెప్పండి మగవాళ్ల రాజ్యం?! ఇళ్లు, ఆఫీస్‌లు.. అలాగే సినిమా ఇండస్ట్రీ. మొత్తం సొసైటీనే ఇలా ఉన్నప్పుడు.. మనకున్న ఒకే చాయిస్.. ఉమెన్‌గా మన ప్రత్యేకత ఏంటో నిరూపించుకోవడం, మన అభిప్రాయం తెలుసుకోవడం, తమ అవసరంగా మగవాళ్లు భావించే పరిస్థితి తీసుకురావడం’’ అన్నారు నిత్య. ‘మిసాజనీ’ అనే మాటను కూడా నిత్య నవ్వుతూ కొట్టేస్తారు. మిసాజనీ అంటే.. స్త్రీ ద్వేషం. ‘‘పనిగట్టుకునైతే మగాళ్లు స్త్రీలను ద్వేషిస్తారని అనుకోను. పురుషాధిక్య సమాజం కదా. మగాళ్లు ఎంత సభ్యతగా బిహేవ్ చేయాలనుకున్నా…ఆడాళ్ళని ‘తీసిపడేయడం’ అనే హ్యాబిట్ అలా వచ్చేస్తుంటుంది..’’ అంటోంది నిత్య. ప్రస్తుతం నిత్య ‘ప్రాణ’ అనే మలయాళం మూవీలో నటిస్తోంది. అందులోని థీమ్.. ఇదే.. భావ ప్రకటన స్వేచ్ఛ. ‘ఆ’ అనే తెలుగు సినిమాలో కూడా నిత్య నటిస్తోంది.