‘వావ్‌ నిత్యా’ అంటూ ఆశ్చర్యపోతున్నారట !

“నా గురించి ఆలోచించడం మానేసి ఎవరి పని వారు చేసుకోవడం మంచిద”ని అంటోంది నటి నిత్యామీనన్‌. ఇతర హీరోయిన్లకంటే నిత్యా కాస్త భిన్నం. ఎవరో ఏదో అంటారని కాకుండా ..తనకు అనిపించింది చేసేసే నటి నిత్యామీనన్‌. విమర్శలను అస్సలు పట్టించుకోని నటి . ఆ మధ్య కాస్త లావెక్కింది. దానిపై కొందరు కామెంట్స్‌ చేస్తే.. “నేను ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు.నాకలా ఉండటమే ఇష్టం. నా గురించి ఆలోచించడం మానేసి ఎవరి పని వారు చేసుకోవడం మంచిద”ని చురకలు వేసింది. ఆ మధ్య అవకాశాలు సన్నగిల్లాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ చేతి నిండా చిత్రాలతో బిజీ అయిపోయింది. హిందీతో సహా పలు భాషల్లో. తమిళంలో ‘సైకో’ అనే చిత్రంలో నటిస్తోంది.ఆమెకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటించే అవకాశం వరించింది. వీటితో పాటు మాతృభాషలో రెండు చిత్రాలు, హిందీలో ‘మిషన్‌ మంగళ్‌’ అనే చిత్రంలోనూ నటిస్తోంది.
 
తాజాగా నిత్యామీనన్‌  చాలా సన్నబడి కొత్త అందాలను సంతరించుకుంది. ఇంతకుముందు బొద్దుగా తయారయ్యిందని సెటైర్లు వేసిన వారే ఇప్పుడు ‘వావ్‌ నిత్యా’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఆమె ఇటీవల మీడియాకు పలు విషయాలను పంచుకుంది. …”నటీనటులను అభిమానులు చూసే కోణం వేరు, మమ్మల్ని మేము చూసుకునే కోణం వేరు. అందరికీ నేను నటి నిత్యా మీనన్‌ని కావచ్చు. కానీ నాకు కాదు” అని చెప్పింది. ముఖ్యంగా ఒక ప్రముఖ నటిననే భావన తనకు ఉండదని చెప్పింది. తనను తాను ఒక సాధారణ మహిళగానే అనుకుంటానని అంది. నాతో నేను క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేస్తుంటాను. షూటింగ్‌ చేస్తున్న సమయంలో చాలా అలసిపోతాం. కోల్పోయిన శక్తినంతా ఖాళీ సమయాల్లో తిరిగి సంపాదించుకుంటాను. సెల్‌ఫోన్‌ బ్యాటరీలు రీచార్జ్‌ చేసుకున్నట్టే ఇది కూడా (నవ్వుతూ). మనతో మనం కనెక్ట్‌ అయితేనే నేచర్‌తో కనెక్ట్‌ అవగలం. నా శక్తినంతా నేచర్‌ నుంచి తెచ్చుకుంటాను. కేవలం శక్తి మాత్రమే కాదు నా ఇన్‌స్పిరేషన్‌ కూడా నేచరే’’ అన్నారు.