కొత్త ప్రయోగాలకు ఇవి చాలా ఉపయోగకరం!

నిత్యామీనన్ ‘బ్రీత్-2’ పేరుతో తెరకెక్కించిన ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. నటనాపరంగా కొత్త ప్రయోగాలు చేయడానికి, సృజనాత్మక వ్యక్తీకరణలకు ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వేదికలుగా మారుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శిస్తున్న అనేక వెబ్‌సిరీస్‌లలో బాలీవుడ్‌కు చెందిన అగ్ర తారలు భాగమవుతున్నారు. దక్షిణాది నటీనటులు ఈ మధ్యే డిజిటల్ వేదికలపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నిత్యామీనన్ ‘బ్రీత్-2’ పేరుతో తెరకెక్కించిన ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది.
 
‘మిషన్ మంగళ్’ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది నిత్యా. ఈ సినిమా విజయోత్సాహంతో ఉన్న ఆమె వెబ్‌సిరీస్‌లో నటించడం సరికొత్త అనుభూతినిచ్చిందని పేర్కొంది. ప్రయోగాత్మక ఇతివృత్తాలకు ప్రాధాన్యతనిచ్చే నాలాంటి నటికి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఎలాంటి కథల్ని అయినా ఇక్కడ చూపించవొచ్చు. మనలోని సామర్థ్యాల్ని మరింతగా వ్యక్తీకరించడానికి ఇవి దోహదపడతాయి. భవిష్యత్తులో మరిన్ని వెబ్‌సిరీస్‌లు చేస్తాను అని చెప్పింది. బ్రీత్ తొలిసిరీస్‌లో మాధవన్, హృషికేష్‌జోషి, అధర్వవిశ్వకర్మ నటించారు. రెండో సిరీస్‌లో అభిషేక్‌బచ్చన్, సయామీఖేర్, నిత్యామీనన్ నటిస్తున్నారు.
ఇప్పుడూ అలానే ఉన్నాను
“నేను హీరోయిన్‌ని కాదు. తెలుగులో ఎలా స్టార్ట్‌ అయ్యానో (తొలి సినిమా ‘అలా మొదలైంది’) మీకు తెలుసు కదా. ఆ సక్సెస్‌తో రెగ్యులర్‌ హీరోయిన్‌ అయిపోవచ్చు. కానీ విభిన్నమైన మార్గంలో వెళ్లాను. అప్పుడూ ఇప్పుడూ అలానే ఉన్నాను. చిన్న పాత్ర అయినా సరే చేశాను. యాక్టర్‌గా అదే నా గుర్తింపు అనుకుంటాను. యాక్టర్‌ అనే వాళ్లు ‘సెల్ఫ్‌ సెంటర్డ్‌’ గా ఉండరు. ‘అన్నింట్లో ప్రాధాన్యం, కథంతా తమ చుట్టే తిరగాలి’.. అన్నట్టు ఉండరు. కథలో కీలకంగా ఉంటే చాలనుకుంటారు”
 
జయలలిత బయోపిక్‌ విశేషాలు
ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభించాలనుకుంటున్నాం. దర్శకురాలు ప్రియదర్శిని ఏదో క్యాష్‌ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయాలనుకోవడంలేదు. ‘ఎప్పుడు ఆరంభించాలి? ఎప్పుడు రిలీజ్‌ చేయాలనే’ది ముఖ్యమైన విషయంగా ఆమె అనుకోవడంలేదు. క్వాలిటీ ఫిల్మ్‌ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి కావొచ్చింది.
 
రెగ్యులర్‌ చిత్రాలకు, బయోపిక్‌కి చాలా తేడా ఉంది. కల్పిత పాత్రలనుకోండి.. మన ఇష్టం వచ్చినట్లు మనం చేయొచ్చు. అదే నిజజీవిత పాత్రలనుకోండి.. వాళ్లు నడిచినట్లు నడవాలి, చూసినట్లు చూడాలి.. అంతా వాళ్లలా కనిపించాలి. అయితే నాకు ప్రెజర్‌ ఏమీ లేదు. ఏ క్రియేటివ్‌ పర్సన్‌ అయినా ఒత్తిడికి గురి కాకూడదని నా అభిప్రాయం. ఒకవేళ ప్రెజర్‌ ఫీలైతే సరిగ్గా వర్క్‌ చేయలేరు. ఈ సినిమా కమిట్‌ అయినవాళ్లందరం బాగా చేయగలుగుతామనే నమ్మకంతో ఉన్నాం