శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఏడాది డబుల్ హ్యాట్రిక్‌తో సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇలాంటి నిర్మాణ సంస్థలో రూపొందుతోన్న చిత్రం `శ్రీనివాస కళ్యాణం`. జీవితంలో పెళ్లి విశిష్టతను ఈ సినిమా ద్వారా తెలియజేప్పే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఏళ్ల క్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, యువ హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ సినిమా ఎంతో సెన్సేషనల్ హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కుతోంది `శ్రీనివాస కళ్యాణం`. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన `శతమానం భవతి` చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ సతీశ్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… “ఒక సాంగ్ కొంత ప్యాచ్ వర్క్ మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. మిగిలిన షూటింగ్ పార్ట్‌ను, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జూలైలో పూర్తి చేసి ఆగస్ట్ 9న `శ్రీనివాస కళ్యాణం` సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. 12 సంవత్సరాల క్రితం ఇదే ఆగస్ట్ 9 న బొమ్మరిల్లు విడుదల అయింది. మళ్ళీ అదే రోజున అదే స్థాయి విజయాన్ని ‘శ్రీనివాస కళ్యాణం’ తో అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము” అని చెప్పారు.
నితిన్, రాశీఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటింగ్: మధు, సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బండి రత్న కుమార్, సంగీతం: మిక్కి జె.మేయర్, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేగేశ్న సతీష్.