‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ సరే… ‘నితిన్ కళ్యాణం’ ఎప్పుడు ?

“టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్” లో నితిన్ ఒకడు. అయితే నితిన్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ ఓ పుకారు షికారు చేస్తుంది. ఆయనతో తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ తో పీకలోతు ప్రేమలో ఉన్నాడని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరో నితిన్ హీరోయిన్ మేఘా ఆకాష్ తో ప్రేమలో ఉన్నాడని గతకొంత కాలంగా పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే . మేఘా ఆకాష్ తో మొదటిసారి ‘లై’ సినిమాలో నటించాడు , అమెరికాలో భారీ షెడ్యూల్ కారణంగా ఆ సమయంలో మేఘా ఆకాష్ – నితిన్ లు ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు రాగా వాటిని ఖండించారు ఇద్దరు కూడా . అయితే, నితిన్ ‘లై’ చిత్రం ఘోర పరాజయం పాలైనప్పటికీ మేఘా ఆకాష్ ని తన తదుపరి చిత్రమైన ” ఛల్ మోహన్ రంగ ” చిత్రంలో మరోసారి పెట్టుకున్నాడు .ఆ సమయంలో మరింతగా దగ్గరయ్యారట. దాంతో మేఘా ఆకాష్ ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పాడట. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా “కొద్దిరోజులు వెయిట్ చేద్దాం అప్పుడు కూడా మేఘా పై నీకు ప్రేమ ఉంటే తప్పకుండా ఆలోచిద్దాం” అని వాయిదా వేశారని కథనాలు వినవస్తున్నాయి .
 
‘జయం’, ‘దిల్’, ‘సై’ వంటి సక్సెస్ లతో కెరీర్ ప్రారంభించిన నితిన్ … ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న టైంలో విక్రమ్ కుమార్ ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ విజయాల బాట పట్టించాడు. ఈ మూవీ తర్వాత చేసిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’,ఇటీవల ‘అఆ’ మూవీలు వరుసగా విజయాలు సాధించాయి. అప్పుటి నుండి పర్లేదు అనిపించుకుంటున్న సమయంలో మరోసారి ‘లై’, ‘చల్ మోహన రంగ’, తాజాగా ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ కూడా ఆయనకు నిరాశకు గురిచేసింది.నితిన్- మేఘా ఆకాష్ ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెబుతున్నారు. తొంద‌ర్లోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నారని సోషల్ మీడియాలో క‌థ‌నాలు వస్తున్నాయి.‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ సినిమా సంగతి సరే… ‘నితిన్ కళ్యాణం’ సంగతి ఏంటి? మేఘా ని చేసుకుంటాడా..? లేదా..? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.