నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ముద్ర’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. వాస్తవిక సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ఎలా మీడియా పరిష్కరిస్తుంది.. అందులో మీడియా బాధ్యతను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు టిఎన్ సంతోష్. ముద్ర సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.. అదే సమయంలో డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు యూనిట్. తొలిసారి ఇందులో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. అతడి బర్త్ డే కానుగా విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో జర్నలిస్ట్ అర్జున్ సురవరంగా నటిస్తున్నారు నిఖిల్. లావణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్ తో జోడీకట్టింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా , రాజా రవీంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి మరియు మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి సంస్థలపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ ముద్ర సినిమాను నిర్మిస్తున్నారు. బి మధు ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉన్నారు. డిసెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ముద్ర సినిమా విడుదల కానుంది.
నటీనటులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: టిఎన్ సంతోష్
సమర్పకుడు: బి. మధు, నిర్మాతలు: కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్
నిర్మాణ సంస్థలు: ఔరా సినిమాస్ మరియు మూవీ డైనమిక్స్
సినిమాటోగ్రఫీ: సూర్య, సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, క్యాస్ట్యూమ్ డిజైనర్: రాగా రెడ్డి
డైరెక్షన్ డిపార్ట్ మెంట్: రమా రమేష్, రంగనాథ్, లోకేష్, భరత్, అరు, బ్రహ్మ
Nikhil’s ‘MUDRA’ release on December 28th
Young hero Nikhil Siddhartha and Lavanya Tripathi starring ‘MUDRA’ is an action thriller. The makers of the film are planning the release on December 28th.
Being directed by TN Santosh, this film is inspired from true incidents and set against journalism backdrop. ‘MUDRA’ is in final stages of shoot while the dubbing works are progressing simultaneously.
For the first time, Nikhil is essaying the role of a journalist and the first look of his which was unveiled on the eve of his birthday got a superb response.
Sam CS is composing music for the film which also features Vennela Kishore, Posani Krishna Murali, Nagineedu, Pragathi, Satya, Tarun Arora and Raja Ravindra in supporting roles.
‘Mudra’ is being produced by Kaviya Venugopal and Rajukumar under Auraa Cinemas PVT and Movie Dynamix LLP banners respectively. B Madhu is presenting the movie.
Cast:
Nikhil Siddharth, Lavanya Tripathi, Vennela Kishore, Posani Krishna Murali, Tarun Arora, Satya, Nagineedu
Crew:
Story, Screenplay & Director: TN Santosh
Presented by: B Madhu,Producers: Kaviya Venugopal and Rajkumar
Banners: Auraa Cinemas and Movie Dynamix
Cinematography: Suryaa,Music: Sam CS
Art Director: Sahi Suresh,Fights: Venkat,Costume Designer: Raaga Reddy
Direction Department: Rama Ramesh, Ranganadh, Lokesh, Bharath, Arul, Brahma